వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మాజీ సైనికోద్యోగుల బహిరంగ లేఖ: దళితులు, ముస్లింలపై దాడులపై ఖండన

దేశంలోని పలుప్రాంతాల్లో ముస్లింలు, దళితులపై చోటుచేసుకొంటున్న దాడులను నిరసిస్తూ మాజీ సైనిక ఉద్యోగులు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ దాడులను వారు తీవ్రంగా తప్పుబట్టారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని పలుప్రాంతాల్లో ముస్లింలు, దళితులపై చోటుచేసుకొంటున్న దాడులను నిరసిస్తూ మాజీ సైనిక ఉద్యోగులు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ దాడులను వారు తీవ్రంగా తప్పుబట్టారు.

గో రక్షకుల పేరుతోనో, ఇతరత్రా కారణాలను చూపుతూ సాగుతున్న దాడుల పట్ల వారు తమ లేఖలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

Armed Forces veterans write open letter to PM Modi: Condemn targeting of Muslims, Dalits

దేశంలో ఏం జరుగుతోందో అర్థం కాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. అకారణంగా చోటుచేసుకొంటున్న దాడులను వారు ప్రస్తావించారు. అంతేకాదు ముస్లింలు, దళితలను లక్ష్యంగా చేసుకొని చేసే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ దాడులను ఖండించిన వారిని జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఈ తరహ ప్రచారాన్ని కూడ తాము ఖండిస్తున్నట్టుగా వారు ఆ లేఖలో పేర్కొన్నారు. సుమారు 114 మంది మాజీ సైనికోద్యోగులు ఈ లేఖపై సంతకాలు చేశారు.

English summary
Highlighting the recent attacks on Muslims and Dalits in the country, the veterans of the Indian Armed Forces have written an open letter to Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X