కారును అడ్డగించి దోపిడీ: నలుగురు మహిళలపై గ్యాంగ్‌రేప్, అడ్డొచ్చిన వ్యక్తి హత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న కొందరిని దోపిడీ చేసిన దుండగులు, ఆ తర్వాత కారులోని నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నోయిడా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న కొందరిని దోపిడీ చేసిన దుండగులు, ఆ తర్వాత కారులోని నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన అదే కుటుంబానికి చెందిన 45ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపేశారు.

జెవర్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కారులో బులంద్‌షహర్‌లోని బంధువుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రేటర్‌ నోయిడా సమీపంలోని ఢిల్లీ జాతీయ రహదారిపై వారి కారును అడ్డగించారు.

Armed robbers gang-rape 4 women, kill man and loot money in UP

ముసుగులు ధరించిన ఆరుగురు వ్యక్తులు కారును ఆపి ప్రయాణికుల నుంచి నగదు, నగలు దోచుకున్నారు. కారులో ఉన్న నలుగురు మహిళలను బలవంతంగా బయటికి లాగి వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మహిళలను కాపాడేందుకు ప్రయత్నించిన అదే కుటుంబానికి చెందిన 45ఏళ్ల వ్యక్తిని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+