యూనీఫాంలో నల్లత్రాచు: కాటుకు బాలిక బలి
పంచమహల్: స్కూల్ విద్యార్థిని యూనిఫాంలో ఉన్న పాము కాటు వెయ్యడంతో బాలిక బలి అయ్యింది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా బాలిక తనకు తాను యూనీఫాం వేసుకుని ప్రాణాలు విడిచింది.
పంచమహల్ జిల్లాలోని రింగానియా గ్రామంలో అర్మితా బింఝ్వర్ (8) అనే బాలిక నివాసం ఉంటున్నది. స్వాతంత్ర దినోత్సవం రోజు స్కూల్ కు ఆలస్యం అవుతున్నదని కాంగారులో తనకు తానుగా యూనీఫాం వేసుకుంది.

కొద్ది సేపటికి నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. క్షణాలలో నోటిలో బురుగు రావడంతో స్పృహతప్పి పడిపోయింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు బాలిక శరీరం మీద పాము కాటు ఉందని గుర్తించారు.
యూనిఫాంలో పాము ఉన్న విషయం తెలుసుకుని వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విరుగుడు మందు ఇచ్చినా చికిత్స విఫలమై అర్మితా మరణించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications