Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో భారత్-పాక్ చెస్ మ్యాచ్ ? ఆర్మీ ఛీఫ్ షాకింగ్..!
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇందులో భారత్ దాడులకు తట్టుకోలేక పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరగా ఆర్మీ అంగీకరించింది. అయితే ఆ తర్వాత మాత్రం భారత్ పై తాము పైచేయి సాధించినట్లు పాకిస్తాన్ స్వదేశంలో చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని ఆర్మీ ఛీఫ్ ఉపేంద్ర ద్వివేదీ ఇవాళ ఐఐటీ మద్రాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బయటపెట్టారు.
ఆపరేషన్ సిందూర్ సాంప్రదాయిక మిషన్ లాగా లేదని, శత్రువు తదుపరి కదలిక గురించి సైన్యానికి ఏమీ తెలియలేదని, ఓ దశలో ఇది చెస్ ఆటలా మారిందని ఆర్మీ ఛీఫ్ ఉపేంద్ర ద్వివేదీ వెల్లడించారు. ఇలాంటి పరిస్ధితుల్లోనూ పాకిస్తాన్ కు తాము చెక్ మేట్ పెట్టినట్లు ఆయన తెలిపారు. అయితే దీన్ని పాకిస్తాన్ తమ విజయంగా చెప్పుకోవడం కుట్రేనని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తాము చెస్ ఆడామని, అయితే శత్రువు కూడా చెస్ ఆడినట్లు ద్వివేదీ తెలిపారు. ఇందులో మనమే విజయం సాధించినట్లు తెలిపారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ముగిశాక తాము విజయం సాధించామని చెప్పుకునేందుకు తమ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కు వ్యూహాత్మకంగా ఫైవ్ స్టార్ జనరల్, ఫీల్డ్ మార్షల్ హోదాలు ఇచ్చిందని మన ఆర్మీఛీఫ్ తెలిపారు. ఇప్పుడు మీరు ఓడిపోయారా లేదా గెలిచారా అని మీరు ఒక పాకిస్తానీ వ్యక్తిని అడిగితే, అతను 'ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. మనం గెలిచి ఉండాలి, అందుకే అతను ఫీల్డ్ మార్షల్ అయ్యాడని చెప్తారన్నారు.
#WATCH | Speaking on Operation, Chief of Army Staff (COAS) General Upendra Dwivedi says, "...On 23rd, we all sat down. This is the first time that RM (Defence Minister Rajnath Singh) said, 'enough is enough'. All three chiefs were very clear that something had to be done. The… pic.twitter.com/aSFRXsS2qn
— ANI (@ANI) August 9, 2025
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ప్రభుత్వ స్థాయిలో రాజకీయ సంకల్పం , వ్యూహాత్మక స్పష్టతతో నడిచిందన్నారు. ప్రధాని మోడీ, రక్షణ మంత్రితో ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వడాన్ని ఆయన గుర్తుచేశారు. ఏప్రిల్ 23న త్రివిధ దళాధిపతులతో భేటీలో ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలని ప్రధాని, రక్షణ మంత్రి తమకు చెప్పారని ఆర్మీ ఛీఫ్ వెల్లడించారు. ఈ మిషన్ కు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం కూడా దేశానికి ఉత్సాహం ఇచ్చిన విషయం అన్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications