యువతిని రక్షించి, ఆకతాయిల దాడిలో జవాను బలి
మీరట్: ఆకతాయిల నుంచి టీనేజర్‌ను రక్షించే ప్రయత్నంలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. దేశమంతటా స్వాతంత్ర వేడుగలు జరుపుకుంటున్న తరుణంలో ఈ విషాధ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రాత్రి ఓ టీనేజర్ వెంట ఆకతాయిల గుంపు వెంటపడింది. 416 ఇంజనీరింగ్ బ్రిగేడ్‌కు చెందిన లాన్స్ నాయక్ వేద్ మిత్ర చౌధురి (35) హర్ దేవ్ నగర్ ప్రాంతం నుంచి పాలు తెచ్చుకునేందుకు వెళ్లాడు.

పాల దుకాణంలో యజమాని కుమార్తె కూర్చుని ఉంది. ఆ సమయంలో ఆమెను ఓ యువకుడు వేధిస్తుండటాన్ని చూశాడు. అతడిని వారించాడు. ఈ సమయంలో మాటామటా పెరిగింది. బాలికను వేధిస్తున్న యువకుడు ఆకాశ్ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో వారు కర్రలతో వచ్చారు.
వచ్చీరాగానే సైనికుడిపై దాడికి దిగారు. కర్రలతో చావబాదారు. తీవ్ర గాయాలపాలైన వేద్ మిత్రను సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. నిందితుడు ఆకాశ్‌తో పాటు, అతని స్నేహితులు సంజూ, రితీష్ లను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications