కాల్పులు: భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదుల హతం(ఫోటోలు)
సోపోర్: జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఆదివారం నాడు కూడా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సోపోర్ సమీపంలోని సైద్‌పారాలో గల ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారు. సమాచారం తెలిసిన భద్రతాదళాలు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతిగా తీవ్రవాదులు కూడా భద్రతా బలగాలపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గావ్ జిల్లాలో ఉగ్రవాదులు శనివారం జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి ఒకరు మృతి చెందారు.
మరో పౌరుడు గాయపడ్డాడు. కుల్గావ్‌లోని హోమ్ శలిబగ్ నియోజక వర్గ ఎమ్మెల్యేకి వ్యక్తిగత భద్రతాధికారిగా జహుర్ అహ్మాద్‌దర్ వ్వవహారిస్తున్నాడు. అహ్మాద్ శనివారం ఎలాహీ అనే వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రెద్వానీ ప్రాంతంలో వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో గాయపడిన అహ్మాద్ దర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. గాయాలుపాలైన అహ్మద్ ఎలాహీ పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఆదివారం నాడు కూడా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
సోపోర్ సమీపంలోని సైద్‌పారాలో గల ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారు. సమాచారం తెలిసిన భద్రతాదళాలు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించాయి.

భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతిగా తీవ్రవాదులు కూడా భద్రతా బలగాలపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
కుల్గావ్ జిల్లాలో ఉగ్రవాదులు శనివారం జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి ఒకరు మృతి చెందారు. మరో పౌరుడు గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications