మత్తు పానీయం ఇచ్చి ఉద్యోగినిపై మేనేజర్ అత్యాచారం

మపుస: గోవా రాష్ట్రంలోని మపుస ప్రాంతంలో దారుణం జరిగింది. తన రెస్టారెంటులో విధులు నిర్వహిస్తున్న ఓ యువతిపై మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు పానీయం తాగించిన నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు, మంగళవారం నిందితుడిపై కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఘటన జనవరి 15న జరిగింది. ఆ రోజు రాత్రి 7.30గంటలకు మహారాష్ట్రలోని దోడమార్గ్‌లోని తన నివాసంలో డ్రాప్ చేస్తానని చెప్పిన యువతి పని చేస్తున్న అర్పోరా రిసార్టు యజమాని డెలానో డికోస్టా తన వాహనంలో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత కొల్వాలె సమీపానికి చేరుకున్న తర్వాత ఆమెకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చాడు.

Arpora resort manager accused of raping staffer

ఆ పానీయం తాగిన యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదరించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

కాగా, అదే రిసార్టులో పని చేస్తున్న మరో యువతి కూడా తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో నిందితుడు డికోస్టాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు సోమవారం జైలు నుంచి విడుదలయ్యాడు. ఆగస్టు 2న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+