వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశిథరూర్ కు అరెస్ట్ వారెంట్: హిందూ మహిళలను అగౌరవపర్చేలా రచన: స్థానిక కోర్టులో కేసు..!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు తిరువనంతపురంలోని స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శశి థరూర్ రచించిన ఒక పుస్తకంలో హిందూ మహిళ గురించి అగౌరవ పరిచే విధంగా రాసారంటూ కోర్టులో కేసు దాఖలైంది. అయితే, దీనిపైన శశి థరూర్ కార్యాలయం మాత్రం అరెస్ట్ వారెంట్ జారీ అయిందనే సమచారం తమకు మీడియా ద్వారా మాత్రమే తెలిసిందని.. గతంలో సమన్లు వచ్చినా..అందులో తేదీలు స్పష్టత ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. సంబంధిత కోర్టుకు ఈ విషయాన్ని నివేదిస్తామని స్పష్టం చేసారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పైన తిరువనంతపురంలోని స్థానిక కోర్టులో కేసు దాఖలైంది. 1989లో ఆయన రచించిన ది గ్రేట్ ఇండియన్ నోవల్ పుస్తకంలో హిందూ మహిళలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఈ కేసు దాఖలు చేసారు.

Arrest warrant against Congress MP Shashi Tharoor against him for allegedly defaming Hindu women

స్థానిక కోర్టులో దాఖలైన ఈ కేసు పైన గతంలోనే సమన్లు జారీ అయ్యాయి. అయినా..శశి థరూర్ లేదా ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందు హాజరు కాలేదు. దీంతో.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఆయన మీద స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని పైన ఎంపీ కార్యాలయం స్పందించింది.

తమకు అరెస్ట్ వారెంట్ గురించి సమాచారం లేదని..గతంలో సమన్లు మాత్రం వచ్చాయని చెప్పుకొచ్చారు. అందులో హాజరవ్వాల్సిన సమయం ఉంది కానీ..తేదీల విషయంలో స్పష్టత లేకపోవటంతో..హాజరు కాలేకపోయామని చెప్పుకొస్తున్నారు. ఇదే విషయాన్ని తమ న్యాయవాది ద్వారా కోర్టుకు నివేదిస్తామని స్పష్టం చేసారు. దీని పైన కోర్టు స్పందనకు అనుగుణంగా తాము తదుపరి అడుగులు వేస్తామని శశి థరూర్ కార్యాలయం స్పష్టం చేసింది.

English summary
court has issued an arrest warrant against Congress MP Shashi Tharoor in connection with a case filed against him for allegedly defaming Hindu women in one of his books.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X