శశికళకు షాక్ ఇచ్చిన జస్టిస్ ఆర్ముగస్వామి, అలా అయితే 15 ఏళ్లు, నో క్రాస్ ఎంక్వైరి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మిస్టరీ మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి శనివారం వీకే శశికళ నటరాజన్ కు షాక్ ఇచ్చారు. మీరు చెప్పినట్లు వింటే ఈ కేసు విచారణ 15 ఏళ్లు పడుతుందని, మీ డిమాండ్లు పరిస్కరించడం కుదరదని జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఝలక్ ఇచ్చింది.

ఎవరు ఫిర్యాదు చేశారు

ఎవరు ఫిర్యాదు చేశారు

తన మీద మీకు ఎవరు ఫిర్యాదు చేశారు అనే విషయం మొదట చెప్పండి, తరువాత తాను విచారణకు సహకరిస్తానని బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ తన న్యాయవాదులతో ఆర్ముగస్వామి కమిషన్ కు చెప్పించారు.

ఇప్పుడు కొత్త వాదన

ఇప్పుడు కొత్త వాదన

జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిన్ ఇప్పటికే విచారణ చేసిన అందర్నీ క్రాస్ ఎంక్వైరీ చెయ్యాలని శశికళ తరపు న్యాయవాదులు డిమాండ్ చేశారు. శశికళను విచారణ చెయ్యకముందే వారందరినీ మేమె విచారణ చేస్తామని శశికళ న్యాయవాదులు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు కొత్త వాదన పెట్టారు.

ఎలా సాధ్యం

ఎలా సాధ్యం

శశికళ తరపు న్యాయవాదులు చేసిన మనవిని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ తిరస్కరించింది. ఇప్పటికే తాము విచారణ చేసిన వారి వాంగ్మూలం రికార్డు చేసుకున్నామని, మళ్లీ వారిని క్రాస్ ఎంక్వైరీ చెయ్యడానికి సాధ్యం కాదని శనివారం తేల్చి చెప్పారు.

15 ఏళ్లు అవుతుంది

15 ఏళ్లు అవుతుంది

శశికళ న్యాయవాదులు చెప్పినట్లు విన్నా, జయలలిత మిస్టరీ మృతిపై క్రాస్ ఎంక్వైరీ చేసుకుంటూ వెళితే కేసు విచారణకు 15 ఏళ్లు పడుతోందని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఎదో ఒక సమస్య

ఎదో ఒక సమస్య

బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను విచారణ చెయ్యడానికి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చెయ్యడానికి సిద్దం అవుతున్న సందర్బంలో ఆమె ఎదో ఒక సమస్య ముందు పెట్టి విచారణ పక్కదొవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sasikala's advocate asks Arumugasamy commission to make cross inquiry those who appeared before the commission. But Arumugasamy rejects this commission and says that if all the persons are to be cross enquired, then the case will complete after 15 years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి