వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పు ఆసియాకు ప్రధాన గేట్‌వేగా అరుణాచల్‌ప్రదేశ్: ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

తూర్పు ఆసియాకు ప్రధాన గేట్‌వేగా అరుణాచల్ ప్రదేశ్‌ను మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్ ప్రజల పరాక్రమం, శౌర్యం ప్రతి భారతీయులకి అమూల్యమైన వారసత్వం అని మోదీ కొనియాడారు. ఆంగ్లో- అబోర్ యుద్దమైనా, దేశ సరహద్దుల రక్షణ అయినా వారి పరాక్రమలు వెలకట్టలేనివని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికి ఓ ఇంజన్‌గా మారుతున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు.

అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈసందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణుణాచల్‌ప్ర‌దేశ్ అభివృద్ధికి అన్ని విధాల సాకారం అందిస్తుందన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సమర్థవంతంగా పనిచేస్తున్నార‌ని కితాబు ఇచ్చారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు.

Arunachal Pradesh as the main gateway to East Asia: PM Modi

దేశం కోసం ప్రాణాలర్పించిన అరుణాచల్‌ప్రదేశ్‌లోని అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. గత ఏడేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇటానగర్‌తో పాటు ఈశాన్య ప్రాంతాల్లోని అన్ని రాజధానులను రైలు మార్గం ద్వారా అనుసంధానం చేయడం తమ ప్రాధాన్య‌త అని స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యాటకంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు.

English summary
Arunachal Pradesh as the main gateway to East Asia: PM Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X