Arunachal Pradesh Results 2024: అరుణాచల్ లో బీజేపీ భారీ విజయం- ఏకంగా ఎన్ని సీట్లంటే..!
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం దిశగా సాగుతోంది. ఏప్రిల్ 19న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. 60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికలకు ముందే 10 మంది అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. ఇందులో సీఎం పెమా ఖండూతో పాటు అంతా బీజేపీ అభ్యర్ధులే కావడం విశేషం.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 60 సీట్లకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 సీట్లలో బీజేపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన 50 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్ లో ఆ 50 సీట్లలోనూ 31 సీట్లలో బీజేపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. గతంలో ఏకగ్రీవంగా గెలిచిన 10 సీట్లను కూడా కలుపుకుంటే 41 సీట్లను బీజేపీ కైవసం చేసుకున్నట్లే లెక్క. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ మరోసారి ఏకపక్ష విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీ ప్రత్యర్థులు ఎన్పీపీ 8 సీట్లలోనూ, పీపీఏ 3 సీట్లలోనూ లీడ్ లో కొనసాగుతున్నారు. ఎన్పీపీ అభ్యర్ధి యేషి త్సెవాంగ్, స్వతంత్ర అభ్యర్థి టెన్జిన్ నైమా గ్లో దిరాంగ్, త్రిజినో-బురాగావ్‌లో ముందంజలో ఉన్నారు. వీరు మినహాయిస్తే మిగిలిన అన్ని సీట్లలోనూ బీజేపీ ఆధిక్యాలు కొనసాగుతున్నాయి. దీంతో బీజేపీ మరోసారి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయమైపోయినట్లే.












Click it and Unblock the Notifications