ఒంటరిగా తాలిబన్ల చేతికి చిక్కిన మలయాళం వ్లాగర్.. కాళ్లు, చేతులు పట్టుకుని బతిమలాడినా వదల్లేదు..!

కేరళకు చెందిన మహిళా ట్రావెల్ వ్లాగర్ అరుణిమాకు అఫ్గానిస్తాన్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆమెను తాలిబాన్లు బంధించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అరుణిమా తన సోషల్ మీడియా పోస్టులో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు ప్రకారం తనను తాలిబాన్లు అరెస్ట్ చేశారని.. ఇండియన్ ఎంబసీ నుంచి తనకు సాయం కావాలని కోరింది. ప్రస్తుతం అరుణిమా అఫ్గానిస్తాన్ లోని బమ్యాన్ లో ఉంది. ఆ తర్వాత మరో పోస్టులో తన ఎక్స్ పీరియన్స్ , ఏం జరిగింది అనేది వివరించింది. ఆ వివరాల ప్రకారం.. " అఫ్గానిస్తాన్ ట్రావెల్ లో భాగంగా నేను ఓ లారీని లిఫ్ట్ అడిగి సాయంత్రానికి బమ్యాన్ చేరుకున్నాను. ఇక అప్పటికే చీకటి పడిన నేపథ్యంలో స్థానికులు నా దగ్గరకు వచ్చి పాస్ పోర్టు , వీసా, ఎకామడేషన్ వివరాలు అడిగారు. అంతలో ఇంగ్లీష్ భాష వచ్చిన ఓ వ్యక్తి వచ్చి నన్ను ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరో చోటుకి తీసుకెళ్లి అక్కడ బస చేసేందుకు ఓ రూమ్ ఏర్పాటు చేశాడు.

వ్లాగర్ అరుణిమా తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు తనను గూగుల్ ట్రాన్స్ లేట్ ద్వారా ప్రశ్నలు అడిగారు. పర్మిట్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అఫ్గానిస్తాన్ లో మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవద్దని ఆ వ్యక్తులు తనకు చెప్పినట్లు అరుణిమా స్పష్టం చేసింది. ఈ మేరకు తాను దేశంలోని చట్టాన్ని ఉల్లంఘించినట్లు అర్థమైంది. " వాళ్లు నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పారు. నా కాళ్లు, చేతులు వణకడం ప్రారంభించాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను డిపోర్ట్ చేయమని కోరాను. కానీ నేను చట్టాన్ని ఉల్లంఘించానని వాళ్లు అన్నారు." అని అరుణిమా పేర్కొంది. ఇక వెంటనే ఈ విషయాన్ని అరుణిమా తన బాయ్ ఫ్రెండ్ కు అలాగే ఇంతకుముందు తనకు హెల్ప్ చేసిన వ్యక్తికి సమాచారం అందించింది.

ఇక అంతకుముందు తనకు సహాయం చేసిన ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి వచ్చి తాలిబాన్లతో అరుణిమా తరఫున మాట్లాడాడు. " నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని తాలిబాన్ కాళ్లు, చేతులు పట్టుకుని బతిమాలాను అయినా అతడు వినలేదు. వాళ్లు నన్ను వెళ్లనివ్వలేదు. నాకు పర్మిట్ అలాగే గైడ్ ఉండాలని చెప్పారు. అంతేకాక వాళ్లు డబ్బులు కూడా డిమాండ్ చేశారు" అని అరుణిమా పేర్కొంది. ఆ తర్వాత ఎలాగోలా అక్కడ గొడవ సద్దుమనగడంతో ఎలాంటి పర్మిట్ లేకుండానే ఆమె మరో దేశం వెళ్లేందుకు అనుమతి లభించింది.

Arunima Taliban harasses Kerala female travel vlogger they did not let her goeven after she pleaded

" కొన్ని గంటలపాటు నేను చాలా భయపడిపోయాను. నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇక చనిపోతానేమో అని భయం వేసింది. నాకు ఏదో జరుగుతుందని అనుమానం కలిగింది. అందుకే ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమోనని ఇన్ స్టా గ్రామ్ లో ఈ పోస్టు పెట్టాను" అని అరుణిమా స్పష్టం చేసింది. తాను మహిళను.. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది ఎదురైందని తెలిపింది. మహిళలు గైడ్ లేదా మగవారితో ట్రావెల్ చేస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండవని వివరించింది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్ ట్రావెల్ కు వెళ్తున్నట్లు వ్లాగర్ అరుణిమా స్పష్టం చేసింది. మొత్తానికి ఆమె ఇన్ స్టా పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+