వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్జీతో కేజ్రీవాల్ భేటీ.. సిసోడియా ఇష్యూ తర్వాత తొలిసారి.. కామన్ మీటే కానీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం‌కు సంబంధించి మనీష్ సిసోడియాపై ఈడీ, సీబీఐ దాడులతో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో గవర్నర్, సీఎం ఇద్దరు మీట్ అయ్యారు. వాస్తవానికి ప్రతీ శుక్రవారం ఇద్దరు మీట్ కావాలి.. కానీ సిసోడియా ఇష్యూ తర్వాత దూరం దూరంగానే ఉన్నారు.

సిసోడియా ఇళ్లు, కార్యాలయాలపై దాడులు.. గవర్నర్‌పై ఆప్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ డెవలప్, ఇతర అంశాలపై చర్చ జరిగి ఉంటుంది. ఇదీ కామన్ మీటింగే.. కానీ ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవు.. అందుకోసమే చర్చకు దారితీసింది.

Arvind Kejriwal-Delhi L-G Saxenas meeting amid raids on Manish Sisodia

అంతకుముందు ఆప్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని గవర్నర్ తెలిపారు. రాజ్యాంగ పదవీని కించపరిచేలా హ్యాష్ ట్యాగ్ ఉపయోగించారని పేర్కొన్నారు. ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని.. గౌరవానికి భంగం కలిగించారని తెలిపారు. ఇంతలో వారిద్దరూ మీట్ అయ్యారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అక్రమాలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది వ్యక్తులు, సంస్థలలో మనీష్ సిసోడియా కూడా ఉన్నారు.

ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలకు సంబంధించి సిసోడియా నివాసంతో సహా 31 ప్రదేశాలపై ఆగస్టు 19న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రను అడ్డుకునేందుకే తనను తప్పుడు కేసులో నిందితుడిగా చేశారని సిసోడియా ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ మంచి పనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నందున ఏజెన్సీ తన నివాసంలో దాడులు నిర్వహించిందని కూడా సిసోడియా ఆరోపించారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal and Lieutenant Governor VK Saxena resumed their weekly meeting on Friday. the first meeting between CM Kejriwal and the Delhi L-G following weeks of tension over raid on Deputy CM Manish Sisodia in excise policy case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X