ఓడించాలని కాంగ్రెస్ ను కోరిన కేజ్రీవాల్

భారతీయ జనతాపార్టీని, నరేంద్రమోడీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కొనేందుకు రేపు పాట్నాలో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆధ్వర్యంలో భేటీ జరగబోతోంది. దేశంలోని 15 పార్టీల ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు. సమావేశానికి ఒకరోజు ముందు ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఒక షరతు విధించింది. తమ డిమాండ్ కు కాంగ్రెస్ అంగీకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

తమ డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోతే రేపటి ప్రతిపక్షాల సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తామన్నారు. దీంతో కాంగ్రెస్ అయోమయానికి గురవుతోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఓడించాలని కోరింది.

arvind kejriwal demand to congress party

అన్ని పార్టీలు ఆమ్ ఆద్మీకి మద్దతు ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ తటస్థంగా ఉండిపోయింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమనుంచి అధికారం లాక్కున చీపురు పార్టీకి మద్దతు ప్రకటించేందుకు కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఇదే అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహానికి కారణమవుతోంది.

ఢిల్లీలోని పాలనాధికారాలు ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, ప్రధాన కార్యదర్శితో ఓ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలోని ప్రభుత్వాధికారులు బదిలీలు, పోస్టింగులు, వారిపై పెత్తనం చెలాయించే అధికారం ఈ కమిటీకుంటుందనేది ఆర్డినెన్స్ సారాంశం. ఏదైనా సమస్య తలెత్తితే అంతిమంగా నిర్ణయం తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కే ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ తీవ్రస్థాయిలో మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+