ఢిల్లీ ఎన్నికల్లో ట్విస్ట్: అడ్డుకునేందుకు వైరి పార్టీలకే మద్దతు!

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈసారి ఎన్నికలు బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రేసులోనే లేదు. గురువారం నాటితో ప్రచారం ముగిసింది.

శనివారం నాడు జరగనున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా అంతర్గత ఒప్పందాలతో ముందుకు వెళ్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ పలుచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించేందుకు బీజేపీ కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఓడిపోతుందని భావించే చోట ఏఏపీ చేతి అండ తీసుకుండవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Arvind Kejriwal Gets Haircut, Kiran Bedi Makes Rotis Before Delhi Polls

ఢిల్లీ ఎన్నికలతో మోడీ హవా కొనసాగుతుందా, ఆగిపోతుందా తెలియనుంది. ఢిల్లీలో బీజేపీ గెలవకుంటే ఇక మోడీ హవా తగ్గినట్లేనని, అది విపక్షాలకు ప్రచార అవకాశంగా మారుతుందనే ఆందోళన బీజేపీలో ఉంది. అందుకే ఢిల్లీ ఎన్నికలు మోడీ పాలనకు రిఫరెండం కాదని బీజేపీ చెబుతోంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే విపక్షాలు మరింత బలహీనమయ్యే ఆస్కారముంది. కేజ్రీవాల్ పార్టీ నుండి బీజేపీలోకి మరిన్ని కూడా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

ఒకరిని నిలువరించేందుకు మరొకరు...

బీజేపీని లేదా మోడీని నిలువరించేందుకు పలుచోట్ల ఏఏపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. తమ వారు ఓడిపోతామని భావించే చోట మరో పార్టీకి మద్దతిస్తారని అంటున్నారు.

అదే సమయంలో ఏఏపీని నిలువరించేందుకు బీజేపీ కొన్నిచోట్ల... అంటే తాము గెలవలేమని భావించో చోట కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వవచ్చునంటున్నారు. కాంగ్రెస్ ఎలాగూ బలహీనమైంది. ఇప్పుడు ఏఏపీని ఎదుర్కొనేందుకు పలు నియోజకవర్గాల్లో బీజేపీ.. కాంగ్రెస్ అభ్యర్థులు లాభపడేలా చేసిందంటున్నారు. కాగా, ఎన్నికలకు ముందు రోజు కేజ్రీవాల్, కిరణ్ బేడీలు తమ రోజువారి చర్యల్లో నిమగ్నమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+