ప్రధానిని నిద్రపోనివ్వను, షీలాదీక్షిత్‌లా కాదు: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ రేప్‌ల నేపథ్యంలో తాను ప్రధాని నరేంద్ర మోడీని నిద్రపోనివ్వనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించే వరకు ప్రధాని మోడీని తాను నిద్రపోనివ్వనని చెప్పారు. తానేమీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌లా నిస్సహాయుడిని కాదని చెప్పారు.
ఢిల్లీ లెఫ్టునెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో మహిళల రక్షణ కోసం ఏమీ చేయలేకపోతున్నప్పుడు ముఖ్యమంత్రి పదవి నుచి తప్పుకోవాలని కేజ్రీవాల్ గతంలో నాటి సీఎం షీలాకు సూచించారు.

నేడు అదే రేప్ బాధ్యతను ప్రధానమంత్రి మీద వేయడం సబబు కాదని షీలా దీక్షిత్ శనివారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధానిని నిద్రపోనివ్వనని కేజ్రీవాల్ చెప్పారు. దీనిపై బిజెపి మండిపడింది. అత్యాచారాలను రాజకీయం చేయవద్దని సూచించింది.
కాగా, ఇద్దరు చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు బాలికలు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం కేజ్రీవాల్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications