'తీవ్రవాది' విమర్శలపై మళ్లీ స్పందించిన కేజ్రివాల్-అంబేద్కర్, భగత్ సింగ్ కలల్ని నిజం చేస్తున్మా
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ ప్రత్యర్ధుల మాటల యుద్ధం పతాకస్దాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ పై ప్రత్యర్ధి పార్టీలు చేసిన తీవ్రవాది వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వీటిపై ఇప్పటికే స్పందించిన కేజ్రివాల్.. మరోసారి వీటిపై మాట్లాడారు.
వేర్పాటువాదులతో సంబంధాలను కలిగి ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రత్యర్ధి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. దీంతో తన భాషలో అవినీతి ప్రత్యర్థులపై కేజ్రివాల్ ఎదురుదాడికి దిగారు. వారు ఉగ్రవాది అని పిలిచే వ్యక్తి ఈ రోజు 12,430 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను అంకితం చేశారని తెలిపారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ అవినీతిపరులంతా కలిసి తనను తీవ్రవాది అని పిలిచారని కాంగ్రెస్,బీజేపీలను ఉద్దేశించి కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. టెర్రరిస్టు అని పిలిచే వ్యక్తి నేడు 12,430 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను జాతికి అంకితం చేశాడని, ఇప్పుడు అధికారులు, న్యాయమూర్తులు, రిక్షా డ్రైవర్లు, కార్మికుల పిల్లలు ఒకే డెస్క్‌లో కూర్చుంటారన్నారు. ఈ ఉగ్రవాది బాబా సాహిబ్ అంబేద్కర్, భగత్ సింగ్ కలలను నెరవేరుస్తున్నాడని కేజ్రివాల్ తన రాజకీయ ప్రత్యర్థులపై పదునైన దాడిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఆప్ లో పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడైన కుమార్ విశ్వాస్ గతవారం వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఇందులో కేజ్రీవాల్ "పంజాబ్ సీఎం కావాలని లేదా ఖలిస్తాన్ ముఖ్యమంత్రి కావాలని" ఆరోపించారు. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయినా కాంగ్రెస్, బీజేపీ అవే విమర్శలు చేస్తున్నాయి. దీంతో కేజ్రివాల్ వాటిపై మరోసారి స్పందించారు.












Click it and Unblock the Notifications