ఒక్క ఎమ్మేల్యేకి 4 కోట్లు, వీడియో విడుదల: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటు రచ్చ ఇంకా జరుగుతూనే ఉంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందంకు అవసరమయ్యే సంఖ్యా బలం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మేల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్సిస్తోందని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
దీనికి సంబంధించిన ఆడియో టేపులను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ టేపులు నిజమని తేలితే బిజెపిపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టులో కూడా ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. బిజెపి ఎంపి షేర్ సింగ్ దగర్ తమ పార్టీకి చెందిన దినేష్ మోహనియాకు 4 కోట్ల లంచం ఇవ్వజూపారంటూ ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని యు ట్యూబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట్ చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బిజెపి ఖండించింది. తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్‌ను దుయ్యబట్టింది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే... ఎమ్మెల్యేలను ఢిల్లీ విడిచి వెళ్లవద్దని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదేశించారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/EGPA-OsKgOg?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇది ఇలా ఉంటే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు చేస్తుంటే... కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ఆమ్ ఆద్మీ కూడా ప్రయత్నాలు చేసిందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బుతో ప్రలోభపెట్టేందుకు చూసిందని ఆయన అన్నారు. ఢిల్లీలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడితో కేజ్రీవాల్ సంప్రదింపులు కూడా జరిపారని సందీప్ దీక్షిత్ అన్నారు.












Click it and Unblock the Notifications