వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బిగుస్తున్న ఉచ్చు: డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్, బిట్ కాయిన్ లో చెల్లింపులు

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని ఎన్సీబీ విచారణలో తేలింది. అయితే దీని వెనుక ఉన్నవారెవరు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆర్యన్ ఖాన్ తరపున వాదించిన న్యాయవాది సతీష్ మానషిండే కోర్టుకు విజ్ఞప్తి చేసినా, కోర్టు బెయిల్ నిరాకరించి ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 7వ తేదీ వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ వరకు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ అధికారులు విచారించనున్నారు.

ఆర్యన్ స్నేహితుడు శ్రేయస్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ అధికారులు

ఆర్యన్ స్నేహితుడు శ్రేయస్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ అధికారులు

ఇదిలా ఉంటే ఆర్యన్ స్నేహితుడు శ్రేయస్ ను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో భారీగా డ్రగ్స్ దొరకడంతో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇప్పటికే పట్టుబడిన వారి ఇళ్లపై దాడులు చేసి ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడినుంచి సప్లై అవుతున్నాయి ? దీని వెనుక వున్న కీలక వ్యక్తులు ఎవరు అన్నదానిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఫోకస్ చేసింది.

క్రిప్టోకరెన్సీని ఉపయోగించి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆర్యన్ ఖాన్

క్రిప్టోకరెన్సీని ఉపయోగించి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆర్యన్ ఖాన్

ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మరో కీలక అంశాన్ని ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆర్యన్ ఖాన్ కార్డెలియా క్రూయిస్ షిప్ రేవ్ పార్టీ నుండి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ శనివారం రాత్రి క్రిప్టోకరెన్సీని ఉపయోగించి కొనుగోలు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) భావిస్తోంది. ఈ కేసులో అత్యున్నత మాదకద్రవ్యాల విక్రేత శ్రేయస్ నాయర్‌ను ఎన్‌సిబి సోమవారం అరెస్టు చేయడంతో ఈ కేసులో మరెన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి అన్నది ఆసక్తి కలిగిస్తుంది . ఆర్యన్ ఖాన్ 'డార్క్ వెబ్' ద్వారా డ్రగ్స్ కోసం ఆర్డర్‌లను అందుకున్నాడని, బిట్‌కాయిన్‌లో చెల్లింపులు చేశాడు అని ఏజెన్సీ తెలిపింది.

ఆర్యన్ ఖాన్ మంచివాడు.. ఎన్సీబీ కావాలనే ఇరికిస్తుందని.. షారూక్ ఫ్యాన్స్ ఆందోళన

ఆర్యన్ ఖాన్ మంచివాడు.. ఎన్సీబీ కావాలనే ఇరికిస్తుందని.. షారూక్ ఫ్యాన్స్ ఆందోళన

ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ కావాలనే ఇదంతా చేస్తున్నారని షారుక్ ఖాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అమాయకుడని షారూక్ ఖాన్ ను టార్గెట్ చెయ్యటం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇదంతా చేస్తుందని మండిపడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ మంచివాడని చూపించే వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఒక పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక భిక్షాటన చేసే చిన్నారి ఆర్యన్ ఖాన్ దగ్గరకు రాగా అతను ఆ చిన్నపిల్లాడికి సహాయం చేశాడని, చాలా మంచివాడని వీడియో వైరల్ చేస్తున్నారు.

ఎన్సీబీపై ఆరోపణలను ఖండించిన సమీర్ వాంఖడే

ఎన్సీబీపై ఆరోపణలను ఖండించిన సమీర్ వాంఖడే


ఇదిలా ఉంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఆరోపణలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) జోనల్ డైరెక్టర్, సమీర్ వాంఖడే సమాధానమిచ్చారు. షారూఖ్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలన్నింటినీ ఖండించారు. మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదన్నారు. షారుక్ ఖాన్ టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదని, గత 10 నెలల్లో మేము 300 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశాము. గత ఒక్క ఏడాదిలో అరెస్టయిన వారిలో ఎక్కువ మంది హార్డ్-కోర్, డ్రగ్స్ సంబంధిత నేరస్థులని పేర్కొన్నారు . అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు.

Recommended Video

Sweden Removes Most COVID-19 Restrictions
ఆర్యన్ ఖాన్ చాట్ లలో సీక్రెట్ కోడ్ లు.. ఆధారాలున్నాయన్న ఎన్సీబీ

ఆర్యన్ ఖాన్ చాట్ లలో సీక్రెట్ కోడ్ లు.. ఆధారాలున్నాయన్న ఎన్సీబీ

చాట్‌లు మొదలైన లింక్‌లు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా యొక్క ప్రమేయాన్ని చూపుతున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. ఆర్యన్ ఖాన్ చాట్‌లు మరియు లింక్‌లలో "కోడ్ పేర్లు" కనుగొనబడ్డాయని, ఆర్యన్ ఖాన్ బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ లను ధ్రువీకరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. ఎవరి మీద ఎన్సీబీకి ఎలాంటి కక్ష ఉండదని ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

English summary
NCB investigation has revealed that Aryan Khan has links with the drug mafia. NCB suspecting aryan khan bought drugs through dark web by using cryptocurrency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X