ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: ఎన్సీబీ సాక్షి ప్రభాకర్ సెయిల్ మృతితో కేసులో కొత్త మలుపు
2021 నాటి ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ శుక్రవారం మధ్యాహ్నం మాహుల్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో గుండెపోటుతో మరణించాడు.

ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షి ప్రభాకర్ సెయిల్ మృతి
షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ లో పాల్గొన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్ లో జరిగిన పార్టీ పై ఎన్సీబీ అధికారులు దాడి చేయడంతో ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డాడు . డ్రగ్స్ కేసులో సాక్షి అయిన కేపీ గోసావికి ప్రభాకర్ సెయిల్ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రభాకర్ సెయిల్ ను కూడా ఎన్సీబీ సాక్షిగా పేర్కొంది. అయితే శుక్రవారం ముంబై పరిధిలోని చెంబూరులో మహుల్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ప్రభాకర్ సెల్ కన్నుమూశారు.

గుండెపోటుతో ప్రభాకర్ సెయిల్ మృతి.. ధృవీకరించిన న్యాయవాది
అతని తరపున వాదిస్తున్న న్యాయవాది తుషార్ ఖండారే మరణాన్ని ధృవీకరించారు. అయితే సెయిల్ ఇంట్లోనే ఉన్నారని, ఆయన మరణం వెనుక ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గుండెపోటుతో సెయిల్ మరణించారని ధ్రువీకరించారు. ప్రభాకర్ సెయిల్ కు తల్లి, భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దహన సంస్కారాలు జరిగే ముందు అతని సోదరులు గ్రామం నుండి వచ్చే వరకు వేచి ఉండాలని కుటుంబం నిర్ణయించుకుంది.

ప్రభాకర్ సెయిల్ కేపీ గోసావికి సెక్యూరిటీ గార్డ్.. సమీర్ వాంఖడే లంచం ఆరోపణలలో సెయిల్
అంటే ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఏపీ గోసావి, ఆర్యన్ ఖాన్ తో కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో మొదటి కేపీ గోసావిని ఎన్సీబీ ఈ కేసులో చేర్చింది. గోసావి పాత్ర అనుమానాస్పదంగా మారిన తర్వాత మరియు వారి ముందు పెండింగ్‌లో ఉన్న కేసులో పూణే పోలీసులు అతన్ని అరెస్టు చేసిన తర్వాత, సెయిల్ అఫిడవిట్ దాఖలు చేశాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) యొక్క స్వతంత్ర సాక్షి అయిన సెయిల్, ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మరియు గోసావికి సంబంధించిన లంచం చెల్లింపుల గురించిన సంభాషణను విన్నానని పేర్కొన్న ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ ఈ కేసులో దుమారం రేపింది.

ప్రభాకర్ సెయిల్ మృతితో కేసు ఏ మలుపు తిరుగుతుందో?
ఈ కేసులో మరో సాక్షి సామ్ డిసౌజా కూడా గోసావి మరియు సెయిల్‌పై ఆరోపణలు చేస్తూ, వారు డబ్బు తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే, సెయిల్ మరణించటంతో ఈ ఆరోపణల వెనుక ఉన్న వాస్తవం వెలుగులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ సాక్షిగా పేర్కొన్న ప్రభాకర్ సెయిల్ మరణంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారుతుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications