• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్యన్ ఖాన్ రెగ్యులర్ డ్రగ్స్ వాడకందారు; రియా చక్రవర్తి కేసుతో లింక్ పెట్టి.. బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ వాదన

|

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో, ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు ముంబై సెషన్స్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమారుడు బెయిల్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెయిల్ పిటిషన్ పై విచారణ నేపద్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ కేసులో కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. రియా చక్రవర్తి కేసుతో ఆర్యన్ ఖాన్ కేసును పోల్చింది.

 రియా షోవిక్ కేసుతో, ఆర్యన్ కేసును పోల్చి బెయిల్ ఇవ్వొద్దన్న ఎన్సీబీ

రియా షోవిక్ కేసుతో, ఆర్యన్ కేసును పోల్చి బెయిల్ ఇవ్వొద్దన్న ఎన్సీబీ

క్రూయిజ్ రేవ్ పార్టీ కేసును, రియా చక్రవర్తి-షోయిక్ కేసు తో పోల్చిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ , షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కలిగి లేనందున అతనికి కేసుతో సంబంధం లేదని కాదని, బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి విషయంలో కూడా వారి వద్ద ఎలాంటి డ్రగ్స్ రికవరీ చేయలేదని, కానీ ఆ సమయంలో కోర్టు ఆ కేసులో వారికి బెయిల్ నిరాకరించి దర్యాప్తు చెయ్యాలని చెప్పిందని అనిల్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

ఆర్యన్ ఖాన్ రెగ్యులర్ గా డ్రగ్స్ వాడతాడు .. అర్బాజ్ దగ్గర దొరికిన డ్రగ్స్ కూడా అందుకే

ఆర్యన్ ఖాన్ రెగ్యులర్ గా డ్రగ్స్ వాడతాడు .. అర్బాజ్ దగ్గర దొరికిన డ్రగ్స్ కూడా అందుకే

ఆర్యన్ ఖాన్ నిత్యం మాదకద్రవ్యాలను వినియోగిస్తారని సెంట్రల్ ఏజెన్సీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వెల్లడించారు. కొన్ని సంవత్సరాలుగా అతను డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు కోర్టుకు తాము రికార్డ్ చేసిన స్టేట్మెంట్లను సబ్మిట్ చేశారు. ఆర్యన్ ఖాన్ ఏదో ఒకసారి మాత్రమే డ్రగ్స్ వినియోగించడం లేదని దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా అతనికి నిత్యం డ్రగ్స్ అలవాటు ఉన్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది. ముంబై క్రూయిజ్ షిప్ కేసులో అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ ఆరు గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నామని, ఆ సమయంలో అతనితో పాటు ఆర్యన్ ఖాన్ ఉన్నాడని ఏజెన్సీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.అర్బాజ్,ఆర్యన్ ఖాన్ తాను డ్రగ్స్ తీసుకోనున్నట్లుగా వెల్లడించారని కోర్టుకు తెలిపారు.

నిత్యం భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆర్యన్ ఖాన్, బిజినెస్ చేశారన్న ఎన్సీబీ

నిత్యం భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆర్యన్ ఖాన్, బిజినెస్ చేశారన్న ఎన్సీబీ


ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాటింగ్ లను బట్టి కేవలం వ్యక్తిగత వినియోగానికి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, భారీ మొత్తంలో డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన సమాచారం ఉందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ ఈ వ్యవహారంలో 15 నుండి 20 మంది వ్యక్తులు పాల్గొన్నారని డ్రగ్స్ వినియోగం గురించి ముందే చర్చ జరిగిందని, ఈ బిజినెస్ లో ఆర్యన్ ఖాన్ కీలక పాత్ర పోషించారని ఎన్సీబీ వాదించింది. ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్ లలో రెగ్యులర్ గా భారీ పరిమాణంలో డ్రగ్స్ కొనుగోలు కేవలం అతని కోసమే అని భావించేలా లేదని ఎన్సిబీ వెల్లడించింది.

  డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడానికి మరో ప్రజా ఉద్యమం రావాలి!!
  ఆర్యన ఖాన్ వద్ద డ్రగ్స్ లేవు, ఆరోపణలు నిరాధారం : ఆర్యన ఖాన్ తరపు వాదన

  ఆర్యన ఖాన్ వద్ద డ్రగ్స్ లేవు, ఆరోపణలు నిరాధారం : ఆర్యన ఖాన్ తరపు వాదన

  దాడి సమయంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీలో లేరని, డ్రగ్స్ కొనడానికి అతని వద్ద నగదు లేదని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది వాదించారు. అక్రమ రవాణా ఆరోపణ అసంబద్ధమైన మరియు తప్పుడు ఆరోపణ అని ఆర్యన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ చెప్పారు. అయితే డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కీలక భూమిక పోషించారు అని కాబట్టి బెయిల్ మంజూరు చేయరాదని ఎన్సీపీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఆర్యన్ ఖాన్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత కోవేట్ నెగెటివ్ రావడంతో ఆర్యన్ ఖాన్ ను ముంబై ఆర్థర్ జైల్లో నిర్బంధ బ్లాక్ నుండి తరలించారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ఆర్యన్ ఖాన్ కు మళ్లీ జైలా ? లేదా బెయిలా అన్నది ఆసక్తికరంగా మారింది.

  English summary
  Aryan Khan is a regular drug consumer says NCB in the bail petition hearing in mumbai sessions court. NCB compares Aryan khan case with Rhea-Showik case. At the same taime claims that he bought bulk quantity of drugs which are not meant for personal use.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X