వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దు: భారత పైలట్‌పై పాక్‌కు అసదుద్దీన్, ఒమర్ అబ్దుల్లా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ పైన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దాడి జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. మిగ్ 21 బైసన్‌ విమానం కూలిపోయే సమయంలో ఆయన ప్యారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. కానీ పీవోకేలోని ఓ నదీ పరీవాహక ప్రాంతంలో ఆయన నేలపైకి దిగారని తెలుస్తోంది. కానీ అప్పటికే విమానం కూలిపోవడం గమనించిన సైనికులు, కొందరు స్థానికులు అక్కడకు చేరుకున్నారు.

 దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్

దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్

అప్పటి వరకు ఆయన ఒంటిమీద ఎలాంటి గాయాల్లేవు. కానీ ఆ తర్వాత ఒక సైనిక స్థావరంలో ఆయన చేతులు వెనక్కి కట్టేసి తీసిన వీడియోలో మాత్రం ఆయన కంటి వద్ద గాయాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. దీంతో ఆయనపై దాడి జరిగినట్లు అర్థమవుతోందని అంటున్నారు. అంతేకాదు, ఆయనను స్థానికులు పట్టుకున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నట్లుగా ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

దీంతో పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడిన మన పైలట్ అభినందన్‌ను హింసించినట్లుగా స్పష్టమవుతోందని అంటున్నారు. మిగ్ 21 కూలిపోయినప్పుడు అభినందన్ ప్యారాచూట్ ద్వారా తప్పించుకున్నాడు. అప్పుడు అభినందన్ పాకిస్తాన్ భూభాగంలో పడిపోయాడు. తమ భూభాగం పరిధిలో పడిపోయిన అభినందన్‌ను పాకిస్తాన్ సైన్యం దారుణంగా చిత్రహింసలు పెట్టిందని అంటున్నారు. యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

ఒమర్ అబ్దుల్లా, అసదుద్దీన్ ట్వీట్

పాక్ ఆర్మీకి పట్టుబడిన అభినందన్‌ను చిత్రహింసలు పెట్టడాన్ని పలువురు నేతలు ఖండించారు. జెనీవా ఒప్పందాన్ని పాటించాలని, దానిని పాటించకపోవడం దారుణమని చెబుతున్నారు. మా పైలట్ అనుకోకుండా మీ వైపు వచ్చినందున, యుద్ధనీతి ప్రకారం అతనిని కూడా మీ సైన్యంలోని వారిలో ఒకడిగా చూడాలని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ట్వీట్ ద్వారా స్పందించారు. ధైర్యశాలి అయిన పైలట్ (అభినందన్) కోసం తాము ప్రార్థిస్తున్నామని, ప్రస్తుతం అతని కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. జెనీవా ఒప్పందం ఆర్టికల్ 3 ప్రకారం ఈ పైలట్ పట్ల వ్యవహరించారని, పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని గౌరవించాలనిచెప్పారు. ఓపాకిస్తానీగా తాను తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, మన చేతిలో బంధీగా ఉన్న ఇండియన్ పైలట్‌ను త్వరగా వెనక్కి పంపించాలని, ఇలా చేస్తారని ఆశిస్తున్నానని, యుద్ధం వద్దు అని తోబా సయ్యద్ అనే పాకిస్తానీ ట్వీట్ చేశారు.

English summary
As Pakistan claimed it had an Indian pilot in custody following an aerial encounter with the Indian Air Force over the Line of Control in Jammu and Kashmir today, there were calls to treat him humanely and in accordance to the Geneva Conventions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X