గోవాలో సోనియా విశ్రాంతి: బీచ్‌లో సైక్లింగ్, స్థానికులతో సెల్పీలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇప్పటివరకు తీరిక లేకుండా గడిపిన సోనియాగాంధీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్యం కూడ బాగా లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు బాధ్యతలను స్వీకరించడంతో సోనియాగాంధీ ప్రస్తుతం గోవాలో గడుపుతున్నారు. జనవరి మొదటివారంలో సోనియాగాంధీ న్యూఢిల్లీకి వెళ్ళనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి సోనియా గాంధీ ఇటీవలనే తప్పుకొన్నారు. రాహుల్‌గాంధీ ఈ బాధ్యతలను ఇటీవలనే స్వీకరించారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో చాలా కాలం వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు.

కొడుకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సోనియా విశ్రాంతి తీసుకొంటున్నారు. గోవాలో ప్రస్తుతం సోనియా సేద తీరుతున్నారు. రాహుల్ మాత్రం పార్టీ వ్యవహరాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

గోవాలో సోనియా విశ్రాంతి

గోవాలో సోనియా విశ్రాంతి

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గోవాలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు.దక్షిణ గోవాలో ఆమె ఓ రిసార్ట్‌లో సేద తీరుతున్నారు. గోవాలో పలు వీధుల్లో ఆమె స్థానికులతో ముచ్చటిస్తున్నారు. గోవాలో సోనియాతో స్థానికులు తీసుకొన్న సెల్పీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాహుల్ బిజీ బిజీ సోనియా విశ్రాంతి

రాహుల్ బిజీ బిజీ సోనియా విశ్రాంతి

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌గాంధీ ఇటీవలనే చేపట్టారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో బిజీ బిజీగా ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ సుమారు 4 మాసాల పాటు ప్రచారం నిర్వహించారు. మరో ఆరు రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు వ్యూహలను రచిస్తున్నారు.

సైక్లింగ్ చేస్తూ సోనియా

సైక్లింగ్ చేస్తూ సోనియా

గోవా బీచ్‌లో సోనియాగాంధీ సైక్లింగ్ చేస్తున్నారు. గోవా రిసార్ట్‌లో బస చేసిన సోనియా అతిధులతో ముచ్చటిస్తూ అక్కడి బీచ్‌ల్లో సైక్లింగ్‌ చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోనియాతో పలువురు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలూ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

బిజెపిపై దాడిని పెంచిన కాంగ్రెస్

బిజెపిపై దాడిని పెంచిన కాంగ్రెస్

బిజెపిపై దాడిని కాంగ్రెస్ పార్టీ పెంచింది. రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో బిజెపిపై విమర్శల జోరును పెంచుతున్నారు. గతంతో పోలిస్తే ఈ తీవ్రత ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sonia Gandhi, 71, was seen riding a bicycle and smiling for a photo in an image tweeted from Goa, where she went for a break just days after handing over the reins of the Congress party to son Rahul Gandhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి