ఇద్దరూ జైహో: మోడీతో భేటీపై అసద్‌కు సల్మాన్ కౌంటర్

 Asaduddin askes supporters not to watch Jai Ho, Salman responds
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశం కావడాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సమర్థించుకున్నారు. మోడీని కలిసినందుకు, ఆయనను ప్రశంసించినందుకు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం జయహోను చూడవద్దని తన మద్దతుదారులకు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ రెండు రోజుల క్రితం పిలుపునిచ్చారు.

మోడీని సల్మాన్ కలవడం కొంత చర్చనీయాంశమైంది. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించారు. మోడని కలవడాన్ని సమర్థించుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు బాగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. అలాగే తన తండ్రి ముస్లిం అని, తన తల్లి హిందువు అని చెప్పారు.

తనకు రెండు వర్గాలతో సన్నిహిత సంబంధం ఉందని, అందరు కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. తాను గుజరాత్‌కు వెళ్లడం ద్వారా ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను సగం హిందువును, సగం ముస్లింను అన్నారు.

తాను తన జయహో చిత్రం ప్రమోషన్ కోసం పతంగులు ఎగుర వేశానని చెప్పారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి మంచి మెసేజ్ ఉన్న చిత్రాన్ని చూసే విషయమై ఆలోచించుకోవాలని సూచించారు. కాగా, మోడీని కలిసినందుకు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం జయహోను చూడవద్దని అసదుద్దీన్ రెండు రోజుల క్రితం తమ పార్టీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+