కేంద్రంలో ముస్లిం మంత్రే లేడా ? ఎందుకంత ద్వేషం-మోడీపై నిప్పులు చెరిగిన ఓవైసీ..!
మణిపూర్ అంశంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. తన ప్రసంగంలో ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్ధాయిలో టార్గెట్ చేశారు. దేశంలో ముస్లింలను టార్గెట్ చేస్తున్న తీరు, పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్ ను వెనక్కి తీసుకురాలేకపోవడం, క్విట్ ఇండియా నినాదం వంటి అంశాలపై ఓవైసీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
హర్యానా ఘటనల్లో ముస్లింలను టార్గెట్ చేస్తున్నప్పుడు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రధాని మోడీని ఓవైసీ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ముస్లింలపై విద్వేషం ఎందుకు పెంచుతున్నారని నిలదీశారు. మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే సీఎంను ఎందుకు తప్పించడం లేదని అడిగారు. ముఖ్యంగా క్విట్ ఇండియా అంటూ విపక్షాలపై కేంద్రమంత్రులు చేస్తున్న విమర్శలకు అసద్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

మన హోంమంత్రి నిన్న క్విట్ ఇండియా గురించి మాట్లాడుతున్నారని, క్విట్ ఇండియా అనే పదాన్ని ఒక ముస్లిం సృష్టించాడని ఆయనకు తెలిస్తే ఈ పదాన్ని ఉపయోగించడన్నారు. కేంద్రం చేస్తున్న రాజకీయాల వల్ల దేశానికి నష్టం జరుగుతుందని ఓవైసీ ఆరోపించారు. దేశం కంటే హిందుత్వ ముఖ్యమా అని ప్రధానిని ప్రశ్నించారు. అసలు మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ప్రధాని మోడీ ఎందుకు అక్కడికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోతున్నారని ఓవైసీ ప్రశ్నించారు.
క్విట్ ఇండియా అంటూ విపక్షాలను విమర్శిస్తున్న కేంద్రం.. హర్యానా మత ఘర్షణలకు కారకుడైన మాంటీ మనేసర్ ను ఎప్పుడు క్విట్ ఇండియా చేస్తుందని ఓవైసీ ప్రశ్నించారు. అలాగే భారత్ లోకి చొరబడిన చైనాను ఎప్పుడు క్విట్ ఇండియా చేస్తుందని అడిగారు. క్విట్ ఇండియా పేరుతో దేశాన్ని కేంద్రం మరోసారి విభజించాలని చూస్తోందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ముస్లింలపై విద్వేషం పెంచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఓవైసీ గుర్తుచేశారు. అసలు కేంద్ర కేబినెట్లో ఒక్క ముస్లిం మంత్రి కూడా ఎందుకు లేరని ఓవైసీ ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications