గాంధీలు, నెహ్రూలు మనకొద్దు.. బాంబ్ పేల్చిన అసదుద్దీన్ ఒవైసీ!

సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లకు షాకిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆజంగఢ్‌లో నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సాంప్రదాయకంగా వస్తున్న ఓటు బ్యాంక్ రాజకీయాన్ని సవాలు చేస్తూ.. ముస్లింలు, వెనుకబడిన వర్గాలు ఇతరులపై ఆధారపడటం మాని, స్వయంప్రతిపత్తి కలిగిన సొంత నాయకత్వాన్ని నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. "మనకు ఇకపై నెహ్రూలు, గాంధీలు అవసరం లేదు. మనకు మన సొంత నాయకులు కావాలి. మన కష్టాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. సాంప్రదాయ పార్టీలు కేవలం ముస్లిం ఓట్లను మాత్రమే కోరుకుంటున్నాయి తప్ప నాయకత్వాన్ని ఇవ్వడం లేదు. కొందరు వచ్చి ఫలానా వారికి మద్దతివ్వండి, వారి నుంచి మరో నెహ్రూ, గాంధీ వస్తారు అని చెబుతారు. కానీ నేను చెబుతున్నాను.. మీరు ఎవరికీ గులామ్‌లు కాదు. వేరొకరి వెనుక తిరగడం ఆపి మీరే నాయకులుగా ఎదగండి" అని ఆవేశపూరితంగా వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi Urges Muslims to Build Own Leadership in Azamgarh Says We Don t Need Gandhi or Nehru

చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌లపై విమర్శలు గుప్పించారు. 1946లో స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, మంత్రివర్గ ఎంపికలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ విషయంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూల మధ్య జరిగిన చర్చలను ఆయన గుర్తు చేశారు. ఆ రోజుల్లో గాంధీ ఆజాద్ విషయాన్ని పక్కనపెట్టి, కేవలం ఓట్ల కోసం ముస్లిం ప్రతీకాత్మక ప్రాతినిధ్యాన్ని మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని.. నేడు అఖిలేష్ యాదవ్ కూడా సరిగ్గా అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.

నాడు కరుణానిధి, జయలలిత.. నేడు విజయ్: తమిళనాడు మార్పులకు అతీతం: ప్రధాని మోదీ
నాడు కరుణానిధి, జయలలిత.. నేడు విజయ్: తమిళనాడు మార్పులకు అతీతం: ప్రధాని మోదీ

సమాజ్‌వాదీ పార్టీకి బలమైన కోటగా భావించే ఆజంగఢ్‌లో అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఈ కామెంట్స్ ఉత్తరప్రదేశ్ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా, యువత స్వయంగా నాయకులుగా, అభ్యర్థులుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మైనారిటీ నాయకులను కేవలం ఓట్లు రాబట్టుకునే సాధనాలుగా మాత్రమే ప్రధాన పార్టీలు వాడుకుంటున్నాయని.. ఆ వివక్షకు ముగింపు పలకాలనే లక్ష్యంతో ఎంఐఎం ఈ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+