Ind VS PAK : ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంట్రా బాబు..రోహిత్ వీడియో వైరల్
కొలంబో: ఎప్పుడెప్పుడా అంటూ ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చింది. భారత్- పాకిస్తాన్ బిగ్ ఫైట్ ఇంకాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. రెండు దేశాల క్రికెట్ అభిమానులకు ఇదొక హైఓల్టేజ్ మ్యాచ్. మ్యాచ్‌కు మించి.. అనే రేంజ్‌లో ఈ రెండు దేశాల ప్రజలు భావిస్తుంటారు.
ఆసియా కప్ 2023లో భాగంగా గ్రూప్ ఏలో భారత్- పాకిస్తాన్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుందీ గేమ్. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోణీ మ్యాచ్‌లోనే తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొనబోతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. ఆశించిన స్థాయిలో ఇన్నింగ్ ఆరంభం కాలేదు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. సుమారు 15-20 నిమిషాల తరువాత మ్యాచ్ పునఃప్రారంభమైంది.
మ్యాచ్ రెస్యూమ్ అయినప్పుడు వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. కేప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగులకే అవుట్ అయ్యాడు. షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 140 కిలోమీటర్ల వేగంతో అఫ్రిది సంధించిన హాఫ్ వ్యాలీ బంతి.. టాప్ ఆఫ్ ది వికెట్స్‌ను ఎగరగొట్టింది. ఆ ఓవర్ తొలి రెండు బంతులను వికెట్లకు దూరంగా సంధించిన అఫ్రిది మూడో బంతిని లైన్ అండ్ లెంగ్త్‌కు వేగాన్ని మిక్స్ చేసి విసిరాడు.
అప్పటికి జట్టు స్కోరు 15 పరుగులే. బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ తరువాత క్రీజ్‌లోకి వచ్చాడు గానీ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అఫ్రిదికే బలి అయ్యాడు. ఏడో ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు అచ్చంగా రోహిత్ శర్మ తరహాలోనే. మిడిల్ స్టంప్ మీద పడ్డ బంతిని తొందరపడి షాట్ ఆడాడు కోహ్లీ. అది కాస్త థిక్ ఎడ్జ్ తీసుకుని లెగ్ స్టంప్‌ను గాల్లోకి లేపింది. అప్పటికి జట్టు స్కోరు 27.
Rohit Sharma is asking camera man to stop filming him. 😂🫣
— 12th Khiladi (@12th_khiladi) September 2, 2023
Credit - (Hotstar)#INDvsPAK #RohitSharma pic.twitter.com/tCTqi71NDZ
కోహ్లీ తరువాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్ కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు. ఈ సారి హ్యారిస్ రవూఫ్ ఖాతాలో వికెట్ పడింది. రవూఫ్ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. గాల్లోకి ఎగిరిన ఈ బాల్ కాస్త నేరుగా ఫకర్ జమాన్ చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోరు 48 పరుగులు. ప్రస్తుతం ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉన్నారు.
వర్షం పడినప్పుడు వచ్చిన గ్యాప్.. రోహిత్ శర్మను బాగా ఇరిటేట్ చేసినట్టయింది. మంచి రిథమ్ మీద ఉన్నప్పుడు వర్షం వల్ల బ్రేక్ తీసుకోవాల్సి రావడం ఏ మాత్రం నచ్చలేదు. దీన్ని అతను దాచుకోలేకపోయాడు. డగౌట్‌లో ఉన్నప్పుడు తనను షూట్ చేయడానికి ప్రయత్నించిన కెమెరామెన్‌పై చిరాకును ప్రదర్శించాడు. తీసింది చాల్లేనంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications