వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాలర్.. పెద్ద నోట్ల రద్దు దెబ్బతో రూపాయి ఢమాల్..

|
Google Oneindia TeluguNews

ముంబై : పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కు తోడు డాలర్ విలువ మరింత బలపడడంతో రూపాయి వెలవెలబోతుంది. ఐదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి ప్రస్తుతం 47పైసల నష్టంతో 67.71వద్ద బలహీనంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ 14నెలల గరిష్ఠానికి బలపడడం, ఎఫ్ఐఐఐలు దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ వంటి కారణాలతో రూపాయి విలువ పతనమవుతోంది.

ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత డాలర్ విలువ మరింత బలపడుతుండడం గమనార్హం. ట్రంప్ విజయానికి తోడు ఫెడ్ అంచనాలు కూడా తోడవడంతో.. ఏకంగా 14సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది డాలర్. ప్రపంచ ప్రధాన కరెన్సీల మారకపు విలువలో ప్రస్తుతం 100ను అధిగమించింది డాలర్. దీంతో దేశీ కరెన్సీ కనిష్ట స్థాయికి దిగజారింది.

Asia stocks under pressure as dollar hovers near 14-year high

ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ ట్రేడింగ్ ఆరంభమయ్యి కాగానే.. 0.53శాతం పతనమై 67.61 స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 67.71వద్ద బలహీనంగా ఉన్న రూపాయి.. జూన్ 30 తర్వాత అత్యంత కనిష్టంగా పడిపోవడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు దేశీయ మార్కెట్లను మరింత ప్రభావం చేసే అవకాశముందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

అంచనాలను నిజం చేస్తూ.. సోమవారం సెలవు తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు భారీ నష్టాలతో మొదలయ్యాయి. మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు భారీగా నష్టపోతున్నాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ విజయం తర్వాత అమెరికాలో డాలర్ రేటు బలపడుతుండడంతో ఇది వడ్డీ రేట్ల పెంపునకు దారి తీస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే ప్రస్తుత మార్కెట్ల నుంచి నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశముండడంతో.. మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

English summary
The US dollar hovered near a 14-year high on Tuesday and Treasury yields extended their rise as investors braced for higher inflation in the United States amid expectations of fiscally expansionary polices under Donald Trump's presidency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X