వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ అధికారం కోసం అస్సాంలో బీజేపీ దూకుడు.. ప్రచారంలో పీఎం మోడీతో సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు

|
Google Oneindia TeluguNews

నాలుగు రాష్ట్రాలు ,ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దూకుడు చూపిస్తుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. ఇక అస్సాం రాష్ట్రంలోనూ బిజెపి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తోంది . ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మోడీ చరిష్మా తో ఈసారి కూడా బీజేపీ అస్సాం రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.

 బెంగాల్ పోరు .. తొలి విడత పోల్స్ కు పీఎం మోడీతో సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే బెంగాల్ పోరు .. తొలి విడత పోల్స్ కు పీఎం మోడీతో సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే

ఎన్నికల ప్రచార బరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జెపి నడ్డా, అమిత్ షా తదితరులు

ఎన్నికల ప్రచార బరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జెపి నడ్డా, అమిత్ షా తదితరులు

మిత్రపక్షాలతో సర్దుబాటు చేసుకున్న బిజెపి గతంలో పోటీ చేసిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగింది. ఈసారి బిజెపి 92 స్థానాలకు పోటీ చేస్తుంది. ఇదిలా ఉంటే అస్సాం రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు బిజెపి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బిజెపి చీఫ్ జెపి నడ్డా, హోంమంత్రి అమిత్ షా, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మరియు మణిపూర్ సిఎం ఎన్ బిరెన్ సింగ్ ,అరుణాచల్ ప్రదేశ్ సిఎం పెమా ఖండు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు .

మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు

కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నరేంద్ర సింగ్ తోమర్ , స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, బీహార్ మంత్రి సయ్యద్ షహ్నావాజ్ హుస్సేన్ కూడా పార్టీ కోసం ప్రచారం చేయనున్నారు. ఇతర ప్రచారకులలో బిజెపి ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మంత్రి హిమంత బిస్వా శర్మ ఉన్నారు. అస్సాం కోసం బిజెపి స్టార్ క్యాంపెయినర్లు గా మొత్తం 40 మంది ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు.126 మంది అసెంబ్లీ స్థానాల కోసం జరగనున్న అస్సాం ఎన్నికల పోలింగ్ మార్చి 27, ఏప్రిల్ 1 మరియు ఏప్రిల్ 6 న మూడు దశల పోలింగ్ జరగనున్నాయి. అస్సాం లో ఓట్ల లెక్కింపు మే 2 న జరుగుతుంది.

 మొదటి దశ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా 47 అసెంబ్లీ స్థానాలు

మొదటి దశ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా 47 అసెంబ్లీ స్థానాలు

అస్సాంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికార బిజెపి పార్టీ 100 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో, బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవటానికి మరియు దాని 'మిషన్ 100 ప్లస్' లక్ష్యాన్ని సాధించడానికి రంగంలోకి దిగింది . 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటి దశ ఎన్నికలలో కీలకమైనవిగా బీజేపీ భావిస్తుంది .

47 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటి దశ పోల్ మార్చి 27 న జరుగుతుంది . ఎగువ అస్సాం మరియు ఉత్తర అస్సాం ప్రాంతంలోని 11 జిల్లాల నుండి 42 సీట్లు మరియు సెంట్రల్ అస్సాం నాగాన్ జిల్లా నుండి ఐదు సీట్లకు మొదటి దశలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.

English summary
BJP announced star campaigners for assam assembly polls . PM Narendra Modi, BJP chief JP Nadda, Home Minister Amit Shah, Union Ministers Nitin Gadkari, NS Tomar & Smriti Irani, UP CM Yogi Adityanath, Madhya Pradesh CM Shivraj Singh Chouhan, & Manipur CM N Biren Singh are among BJP's star campaigners for Assam Assembly polls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X