Assam Exit poll 2021: అసోం బీజేపీదే- 75-85 సీట్లు-ఇండియాటుడే పోల్
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్జాయి. అస్సాం అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకోవం ఖాయమని తేలిపోయింది. ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు భావించినా చివరికి బీజేపీదే పైచేయి అవుతోంది. ఎన్నార్సీ అమలుపై ఓటర్లు సానుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు చెప్తున్నాయి..
Recommended Video

అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీ కూటమి 75 నుంచి 85 సీట్ల వరకూ దక్కించుకోనుందనిఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ కూటమికి కేవలం 40 నుంచి 50 సీట్లు దక్కవచ్చని ఈ ఎగ్డిట్ పోల్ తెలిపింది. ఇతరులకు 1-4 సీట్లు దక్కబోతున్నట్లు ఈ పోల్ వివరించింది. బీజేపీ కూటమిలో బీజేపీకి అత్యధికంగా 61-65 సీట్లు దక్కుతుండగా.. ఏజీపీకి 9-13 సీట్లు, యూపీపీఎల్‌కు 5-7 సీట్లు దక్కనున్నాయి. అలాగే కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్‌కు 24-30 సీట్లు వస్తుండగా.. ఏఐయూడీఎప్‌కు 13-16 సీట్లు దక్కనున్నాయి. మరో భాగస్వామి బీపీఎఫ్‌కు 3-4 సీట్లు రావొచ్చని అంచనా.

ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం బీజేపీ కూటమిలో బీజేపీ అత్యధిక స్దానాలతో జయకేతనం ఎగరవేయనుండగా.. కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ మరో భాగస్వామి ఏఐయూడీఎఫ్ కంటే స్వల్పంగా మెరుగైన ప్రదర్శన చూపబోతోంది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములు సాధించే అన్ని సీట్లు కలిపినా బీజేపీ సాధించే సీట్ల కంటే తక్కువగా ఉండటం ఇక్కడ మరో విశేషం. ఎన్నార్సీ అమలుతో బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని భావించినా దాని ప్రభావం ఏమాత్రం పడలేదని తాజా ఫలితాల అంచనా ద్వారా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications