కాల్పుల్లో ఆరుగురు మృతి: అస్సాం-మేఘాలయ సరిహద్దులో ఉద్రిక్తత, ఇంటర్నెట్ బంద్
గౌహతి/షిల్లాంగ్: అస్సాం-మేఘాలయ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మేఘాలయలో కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించిన తర్వాత 48 గంటల పాటు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేశారు. మేఘాలయాలోని ముకోహ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
ఈ క్రమంలో మేఘాలయ ప్రభుత్వం మంగళవారం నుంచి 48 గంటల పాటు ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పశ్చిమ జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి-భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్, సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్‌తో సహా జిల్లాల్లో ఇంటరెట్ నిలిపివేశారు.

మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో అస్సాం-మేఘాలయ సరిహద్దులో అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో జరిగిన హింసలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు.
Meghalaya government suspends Mobile Internet services in 7 districts for 48 hours from Nov 22 onwards, following the firing incident in Mukoh where four persons were killed. https://t.co/GCSNYJMnGY pic.twitter.com/KTlUMscMLH
— ANI (@ANI) November 22, 2022
అసోం అటవీ శాఖ బృందం ముక్రు ప్రాంతంలో అక్రమ కలపను తరలిస్తున్న ట్రక్కును అడ్డుకుని ఆపింది. ట్రక్ తెల్లవారుజామున 3 గంటలకు మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా వైపు వెళుతున్నట్లు వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ పోలీసు సూపరింటెండెంట్ ఇమ్దాద్ అలీ తెలిపారు.
ట్రక్కుతో పారిపోవడానికి ప్రయత్నించగా.. ఫారెస్ట్ గార్డులు టైర్‌పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత డ్రైవర్, పనివాడు, మరొక వ్యక్తిని పట్టుకున్నారు. మరికొందరు తప్పించుకున్నారు.
Total six persons including five from Meghalaya and one Assam Forest Guard killed in the incident. The injured persons rushed to hospital. Inquest conducted FIR registered by Meghalaya police: Meghalaya CM Conrad Sangma pic.twitter.com/kYSgr9WzAI
— ANI (@ANI) November 22, 2022
ఈ ఘటనపై మెఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ.. ఈ ఘటనలో మేఘాలయకు చెందిన ఐదుగురు, ఒక అస్సాం ఫారెస్ట్ గార్డ్ సహా మొత్తం ఆరుగురు మరణించారని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఈ కేసులో మేఘాలయ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.
అంతేగాక, ఈ ఘటనపై తాను అస్సాం సీఎంతో మాట్లాడినట్లు, ఆయన సహకరిస్తానని హామీ ఇచ్చారని సీఎం సంగ్మా పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications