షాకింగ్: రాష్ట్రాల మధ్య రక్తపాతం -మిజోరాం బోర్డర్‌లో 6గురు అస్సాం పోలీసులు హతం -అమిత్ షా ఎక్కడ?
ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు రక్తపాతానికి దారి తీశాయి. అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య తాజాగా తలెత్తిన సరిహద్దు గొడవల్లో భారీ హింస చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నుంచి రెండు వైపులా పోలీసులు, వివిధ శాఖల అధికారులు, స్థానికులు, రైతులు పరస్పరం కొట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే..
Recommended Video
మిజోరాంతో సరిహద్దు ఘర్షణల్లో అస్సాం హోం శాఖకు చెందిన ఆరుగురు పోలీసులు బలయ్యారు. అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వెంబడి తాజాగా చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు చనిపోయిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాకు తెలిపారు. ఇటు హిమంత, అటు మిజోరాం ముఖ్యమంత్రి జోరమంతుంగా వరుస ట్వీట్లు చేస్తూ, అమిత్ షాను ట్యాగ్ చేస్తున్నా కేంద్రం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి..

అస్సాం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి మిజోరాంలోకి ప్రవేశించి, పంటలు, పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెలను కాల్చిబూడిద చేశారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, సదరు భూభాగం అస్సాం కిందికి వస్తుందని, మిజోరాం ఆక్రమణకు పాల్పడిందని అస్సాం అధికారులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అస్సాం పోలీసులు, ఇతర శాఖ అధికారుల వాహనాలపై మిజోరాం రైతులు దాడికి పాల్పడ్డారు.

ఘర్షణల్లో తుపాకులు, నాటు బాంబులు వాడుతున్నట్లు రిపోర్టులు వచ్చాయి. పోలీసుల మరణాలు కాల్పుల వల్లే జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. దాడికి పాల్పడింది మీరంటే మీరేనంటూ అస్సాం, మిజోరాం ముఖ్యమంత్రులు ట్విటర్ లో మాటల యుద్ధం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎంలతో కీలక మీటింగ్ నిర్వహించిన మరుసటి రోజే అస్సాం-మిజోరాం మధ్య గొడవలు చెలరేగడం గమనార్హం.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications