వృద్ధుడి ఇంట్లో రూ.1.55కోట్లు: అన్నీ కొత్త నోట్లే!
85 ఏళ్ల వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త ఇంట్లో అసోం పోలీసులు కోటిన్నర రూపాయల విలువ చేసే కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
గౌహతి: పెద్దనోట్ల రద్దు తర్వాత అక్రమ మార్గాల్లో తరలుతున్న కొత్త నోట్లను ఎప్పటికప్పుడు పట్టెస్తున్నారు అధికారులు. తాజాగా, 85 ఏళ్ల వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త ఇంట్లో అసోం పోలీసులు కోటిన్నర రూపాయల విలువ చేసే కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
అద్దెల మీద మాత్రమే ఆధారపడి బతికే ఈయన వద్ద ఇంత మొత్తం ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈయనకు గతంలో హోటల్ వ్యాపారం ఉండేది.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. గౌహతి నగరానికి చెందిన బెల్టోడా ప్రాంతంలోని హర్దీప్ సింగ్ బేదీ ఇంట్లో సోదాలు చేశారు. కొత్త 500, 2000 రూపాయల నోట్లలో మొత్తం రూ. 1,54,81,000 నగదు లభ్యమైందన్నారు.
అందులో 75వేల రూపాయలకు కొత్త 500 నోట్లు ఉండగా, మిగిలినవి 2వేల రూపాయల నోట్లు. ఈ మొత్తాన్ని పోలీసులు ఈ కేసును ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ పి బోరా కేసు విచారిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications