ఏడేళ్ల బాలుడిపై 7సార్లు కాల్పులు! బోడోల ఎఫెక్ట్‌తో... (పిక్చర్స్)

గౌహతి: బోడో తీవ్రవాదుల దాడిలో గాయపడ్డ ఏడేళ్ల బాలుడు కోలుతోడు గౌహతి మెడికల్ కళాశాల ఆసుపత్రి (జీఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్నాడు. 7ఏళ్ల ఆ బాలుడిని ఏడుసార్లు కాల్చారు. అతను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసోంలోని సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో మంగళవారం బోడోలు దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. వారి దాడిలో 17 మంది ఆదివాసీలు గాయపడ్డారు. అందులో ఈ బాలుడు కూడా ఉన్నాడు. ఆమెకు అత్యుత్తమ చికిత్స అందించేందుకు బుధవారం నగరానికి తీసుకు వచ్చారు.

ఆ ఏడేళ్ల బాలుడు కోలుతోడు సంఘటన జరిగిన రోజు తన గ్రామమైన పక్రీగురిలో ఉన్న తన చిన్న ఇంటి తలుపు ముందు నిలబడినాడు. అప్పుడు బోడోలు కాల్పులు జరిపారు. బాలుడి ముఖం, మోచేయి, నడుము, చేయి తదితర ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఈ గ్రామం కోక్రాఝర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ కాల్పుల్లో ఆమె తల్లి మృతి చెందింది. తల్లి ఎండుగడ్డి బయట ఎండబెడుతుండగా కాల్పులు జరిగాయి. అప్పుడు తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ చిన్నారి మాత్రం ఇంటిముందు నిలబడ్డాడు. మిగతా తమ పిల్లలు ఇంట్లో ఉన్నారని కోలుతోడు తండ్రి చెప్పారు.

అసోం ఆదివాసీలకు అన్ని విధాలా సాయం: మమత

బోడో

బోడో

అసోంలో బోడో తీవ్రవాదులు దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అఫ్ బోడోలాండ్ తీవ్రవాదాల దాడి నేపథ్యంలో రిలీఫ్ క్యాంపులో ఓ తల్లి.

బోడో

బోడో

అస్సాంలో నరమేధం సృష్టిస్తోన్న బోడో తీవ్రవాదులను పూర్తిస్థాయిలో అణచివేస్తామని, ఇందుకోసం సైనిక కార్యాచరణను తీవ్రతరం చేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ స్పష్టం చేశారు.

బోడో

బోడో

అసోంలో బోడో తీవ్రవాదులు దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అఫ్ బోడోలాండ్ తీవ్రవాదాల దాడుల నేపథ్యంలో వలసపోతున్న ఓ గ్రామస్తులు.

బోడో

బోడో

అసోంలో బోడో తీవ్రవాదులు దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అఫ్ బోడోలాండ్ తీవ్రవాదాల దాడుల నేపథ్యంలో వలసపోతున్న ఓ గ్రామస్తులు.

బోడో

బోడో

అసోంలో బోడో తీవ్రవాదులు దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అఫ్ బోడోలాండ్ తీవ్రవాదాల దాడి నేపథ్యంలో రిలీఫ్ క్యాంపులో వండుకుంటున్న గ్రామస్థులు.

అసోంలో ఆదివాసీలపై జరిగిన మారణకాండకు పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆశ్రయం కోసం ఆ రాష్ట్రం నుంచి వచ్చే ఆదివాసీలకు సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

అసోంలో సాయుధ తీవ్రవాదులు ఆదివాసీలపై జరిపిన మారణకాండ తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మమత తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఆశ్రయం కోసం చాలా ఆదివాసీ కుటుంబాలు ఆ రాష్ట్రం నుంచి తమ రాష్ట్రంలోకి రావడం మొదలుపెట్టారని, వారికి సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+