భర్తను కొట్టి ఏడుగురు భార్యను రేప్ చేశారు
రాంగియా: అస్సాం రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏడుగురు వ్యక్తులు భర్తను కొట్టి, భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ సంఘటన అస్సాంలోని కామరూప్ జిల్లాలో జరిగిందని పోలీసులు శుక్రవారంనాడు వెల్లడించారు.
గురువారం సాయంత్రం బక్సా జిల్లాకు చెందిన యువతి తన భర్తతో కలిసి కామరూప్ జిల్లాలో కెకెనికుచి ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో దారిలో ఏడుగురు దుండగులు భార్యాభర్తలపై దాడి చేశారు. భర్తను తీవ్రంగా కొట్టి భార్యను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడినవారిలో మహిళ బంధువు పంకజ్ దాస్ కూడా ఉన్నాడు. అరెస్టయినవారిలో అతనితో పాటు తిలక్ దాస్, నరేశ్వర్ దాస్ ఉన్నారు.
పరారీలో ఉన్నవారిని సోన్మోని దాస్, ప్రభాత్ దాస్, సతీష్ దాస్, దీపక్ దాస్‌లుగా గుర్తించారు. మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె ప్రస్తుతం గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications