Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిజోరం, ఛత్తీస్‌గఢ్ తొలి విడతకు ముగిసిన ప్రచారం: పోలింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాదిలో ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజుతో ఓ రెండు రాష్ట్రాల్లో తొలి దశ ప్రచారం ముగిసింది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, మిజోరం (Mizoram)లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్‌గఢ్ (chhattisgarh)లోని 20 స్థానాలకు మొదటి విడతలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది.

కాగా, మంగళవారం పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. నవంబర్ 7న తొలి విడత ఎన్నికలు జరగరనున్న క్రమంలో రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Assembly elections: Polling countdown begins as campaigning for Mizoram, Chhattisgarh Phase 1 end today.

మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 174 మంది బరిలో నిలబడ్డారు. 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), జోరం పీపుల్స్ మూమెంట్, కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయిలో అభ్యర్థులను రంగంలోకి దించాయి. బీజేపీ 23 మందిని, ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురిని పోటీలో నిలిపాయి. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదేళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది.

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే మేనిఫెస్టోలు కూడా విడుదల చేశాయి. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలి విడతలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. మిగితా 70 స్థానాలకు నవంబర్ 17న మరో విడతలో నిర్వహించనున్నారు.

ప్రస్తుతం జరగుతోన్న 20 స్థానాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కాగా, మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగుస్తుండగా.. ఛత్తీస్ గఢ్ శాసనసభ గడువు 2024, జనవరి 3న ముగియనుంది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు త్వరలోనే పూర్తికానున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+