క్లైమాక్స్: నాలుగు రాష్ట్రాల ఫలితాలు తేలేది ఈరోజే

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం (నవంబర్ 8న) వెలువడనున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భవితవ్యం ఆదివారం తేలనుంది. మరో రాష్ట్రం మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 9న వెలువడనున్నాయి. ఢిల్లీలో 65శాతం ఓటింగ్ నమోదవగా, మిజోరాంలో 81శాతం ఓటింగ్ నమోదైంది.

రాజస్థాన్ 74శాతం ఓటింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. అదే సమయంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో 70శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విస్తృత పర్యటనలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీకి ఫలితాలు అనుకూలంగావ వస్తాయా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపునుందో కూడా రేపు వెలువడనున్న ఫలితాలతో తేలనుంది.

Assembly poll verdict in four states tomorrow

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ప్రధాన పార్టీ నెలకొనగా, ఢిల్లీలో మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపిలకు తగ్గ పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీట్లను బిజెపి కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నాలుగవ సారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి రికార్డు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు అరవింద్ కేజ్రివాల్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కాంగ్రెస్, బిజెపిలపై తీవ్రంగా ఉండనుందని తెలుస్తోంది. బిజెపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్ధన్ బరిలో ఉన్నారు.

ఢిల్లీలో ఉన్న 70 స్థానాలకు గాను 810 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, బిజెపి మాత్రం 66 స్థానాల్లోనే బరిలోకి దిగింది. మిగితా నాలుగు స్థానాల్లో శిరోమణి అకాళిదళ్ పార్టీకి చెందిన అభ్యర్థులను బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అభ్యర్థి, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిరాధిత్య సింథియా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.బిజెపి రాష్ట్రంలోని 230 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 229 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 2,583మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లానే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది. బిజెపి, కాంగ్రెస్‌లు రాష్ట్రంలోని 90 స్థానాలకు పోటీ చేశాయి. మొత్తం 986మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిజోరాంలో మాత్రం కాంగ్రెస్ మళ్లీ అధికారం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలోని 40 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎంఎన్ఎఫ్, మిజో పీపుల్స్ కాన్ఫరెన్స్‌తో 31 స్థానాల్లో పోటీ చేసింది. జోరాం నేషనలిస్ట్ పార్టీ 38 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 40 స్థానాలకు 142మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+