మరికొద్ది గంటల్లో యూపీలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు: 58 స్ఠానాలకు పోలింగ్
లక్నో: దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 10 గురువారం రోజున తొలి దశ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి దశలో 58 స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు కూడా పూర్తి చేసింది.
Recommended Video
మొదటి విడతలో 58 నియోజకవర్గాల్లో 2.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 58 అసెంబ్లీ స్థానాల కోసం 500 మందికి పైగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత పోలింగ్ ఫిబ్రవరి 14వ తేదీన జరగనుంది. వివాదాస్పద ప్రకటనలు, వలసలు, రైతులు, కులం, మతం అనే ఐదు అంశాలను దాటుకుని ఓట్లను తమవైపు తిప్పుకునే పార్టీనే ఉత్తర ప్రదేశ్‌లో అధికారం దక్కించుకుంటుంది. ముఖ్యంగా ఈ ఐదు అంశాలే యూపీలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు అక్కడి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, పశ్చిమ యుపీలోని 11 జిల్లాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే మొదటి దశలో ఈ మొత్తం 15 సీట్లలో మాత్రమే కొద్ది ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అందరిచూపు ఈ సీట్లపైనే ఉంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ గురువారం ప్రారంభమవుతుంది. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
కాగా, భారతీయ జనతా పార్టీ 2017లో తిరుగులేని విజయం దక్కించుకుంది. ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో.. మొత్తం 408 స్థానాల్లో 312 సీట్లను కైవసం చేసుకుని అధికారం దక్కించుకుంది. ఇప్పుడు కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది బీజేపీ. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. తొలి దశలో 58 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ 53 స్థానాల్లో విజయం సాధించింది. మోడీ వేవ్ పూర్తి ప్రయోజనం బీజేపీకి దక్కింది.
కాగా, బీజేపీకి ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం. ఎందుకంటే, యూపీలో గెలవకపోతే 2024లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉండనుంది. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ దేశరాజకీయాల్లో కూడా కీలకంగా ఉంటుంది. యూపీలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications