వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుట్ర, కుతంత్రంతోనే బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. మోడీ, షాపై దీదీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల్లో మోసం చేసి గెలుపొందారని ఆరోపించారు. కుట్ర, కుతంత్రాలతో సాధించిన విజయం.. ఓ విజయమేనా అని ప్రశ్నించారు. కొన్ని స్థానాల్లో గెలిస్తేనే తమ మనస్తత్వాన్ని ఆ పార్టీ నేతలు బయటపెట్టారని ప్రజలకు హితవు పలికారు. ఆదివారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో మెగా ర్యాలీ నిర్వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ కుట్రలను ఎండగట్టారు.

కుట్ర కోణం ..?
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కుట్ర అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఈవీఎంల ద్వారా దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు బీజేపీకి మద్దతు తెలిపాయని మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించి అన్ని మార్గాల్లో లాబీయింగ్ చేశారని పేర్కొన్నారు. దీంతో 18 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారని వివరించారు. 2014లో 2 సీట్లు గెలిచిన బీజేపీ .. ఐదేళ్లలో 18 సీట్లు గెలుస్తోందా అని ప్రశ్నించారు. అదే సమయంలో 34 సీట్లు గెలిచిన టీఎంసీ 22 సీట్లకు పడిపోయిందని పేర్కొన్నారు.

At Kolkata mega rally, Mamata Banerjee says BJP ‘cheated’ in Lok Sabha polls

1993లో కోల్‌కతాలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి కమ్యునిస్ట్ ప్రభుత్వం వారిపై కాల్పులు జరిపింది. దీంతో 13 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆసువులు బాశారు. ఆ సమయంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు మమతా బెనర్జీ. అప్పటినుంచి ఏటా జూలై 21న అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా మెగా ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. బెంగాల్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలలో కాకుండా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని మమత డిమాండ్ చేశారు. అంతేకాదు లోక్ సభ ఎన్నికలను కూడా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని కోరిన సంగతి తెలిసిందే.

English summary
West Bengal chief minister Mamata Banerjee launched a scathing attack on the BJP on Sunday accusing the party of “cheating” to win the Lok Sabha elections. “In Lok Sabha elections they won by cheating—by using EVMs, CRPF and Election Commission.They just got 18 seats, by getting few seats they are trying to capture our party offices and beating our people,” Mamata Banerjee was quoted as saying by news agency ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X