• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలెం బస్సు దుర్ఘటనను గుర్తు చేసిన ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం: స్పందించిన మోడీ

|
Google Oneindia TeluguNews

జైపూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు జాతీయ రహదారిపై పాలెం వద్ద ప్రమాదానికి గురైంది. మంటల బారిన పడి.. పూర్తిగా దగ్ధమైంది. ఆ ఘటనలో 42 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. డ్రైవర్, ఒకరిద్దరు ప్రయాణికులు తప్ప మరెవరూ ప్రాణాలతో బయటపడలేదా ఘటనలో.

కేసీఆర్‌తో పాటే జగన్: ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం స్కెచ్: తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారికేసీఆర్‌తో పాటే జగన్: ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం స్కెచ్: తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి

అలాంటి ఉదంతమే తాజాగా రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఈ ఉదయం బార్మెర్ నుంచి జైపూర్‌కు సుమారు 25 మంది ప్రయాణికులు బయలుదేరింది ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు. మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. బార్మేర్‌-జోధ్‌పూర్‌ జాతీయ రహదారిపై పఛ్‌పద్రా సమీపంలో అదుపు తప్పింది. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

At least 12 killed in collision between bus and truck in Rajasthan, PM Modi announces an exgratia

ట్యాంకర్‌ను ఢీ కొట్టిన వెంటనే ఇంధన ఫౌంటెయిన్‌లాగా విరజిమ్మింది. ఈ వెంటనే భగ్గుమంటూ ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో విస్తరించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయని పేర్కొన్నారు. కొందరు ప్రయాణికులు కిటికీ అద్దాలను పగులగొట్టుకుని కిందికి దూకారని పేర్కొన్నారు. అలా బయటపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పారు. మంటల బారిన పడి మరి కొందరు సజీవ దహనం అయ్యారు.

తొలుత అయిదు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆ తరువాత మృతుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఎనిమిది నుంచి 11కు చేరింది. తాజాగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 12కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. బస్సులో నుంచి మృతదేహాలను వెలికితీయడం సహాయక సిబ్బంది కష్టతరమైంది. మంటలు పూర్తిగా వ్యాపించడంతో దాన్ని నియంత్రించడానికి శ్రమించాల్సి వచ్చింది.

సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ప్రధాని ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

English summary
At least 12 killed in collision between bus and truck near Pachpadra in Rajasthan's Barmer district, PM Narendra Modi announces an exgratia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X