Delhi Assembly Election 2025: "34 లక్షలమందికి నీళ్లు కట్.. బీజేపీ కుట్ర"

దిల్లీ ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతోంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు పోటీపడి మరీ హామీలు ఇస్తున్నాయి. మూడోసారి అధికారం పొందాలని ఆప్ ఎదురుచూస్తుండగా.. 26 ఏళ్ల తర్వాత తిరిగి దేశ రాజధానిని ఏలేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. దీంతో ఈసారి దిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

వాటర్ టెర్రరిజం..

దిల్లీ ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో దిల్లీ సీఎం ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీకి సరఫరా అవుతున్న తాగునీటిని కలుషితం చేసి ఆ నెపాన్ని ఆమ్ ఆద్మీ పార్టీపై వేసి ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. హరియాణాలోని బీజేపీ సర్కార్ కావాలనే దిల్లీకు సరఫరా అయ్యే నీటిని కలుషితం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. బీజేపీ కుట్ర వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆతిశీ తెలిపారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకుని.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.

Atishi Accuses Haryana BJP of Polluting Yamuna to Undermine Delhi s Water Supply

34 లక్షల మందికి నీళ్లు బంద్..

హరియాణా, దిల్లీ గుండా యమునా నది ప్రవహిస్తుంది. ఈ నదిలో హరియాణా సర్కార్ కావాలనే రసాయనాలు, పరిశ్రమలకు చెందిన కలుషితాలు కలిపేస్తున్నారని ఆప్ సర్కార్ మండిపడుతోంది. "దిల్లీ జల్ బోర్డు కేవలం 1 పీపీఎమ్ పరిధిలోని అమ్మోనియాను మాత్రమే శుభ్రం చేసే సామర్థ్యం ఉంది. కానీ హరియాణా ప్రభుత్వ చర్యల వల్ల దిల్లీలోని వాటర్ ప్లాంట్స్ లో అమ్మోనియం లెవెల్స్ 7 పీపీఎం కంటే అధికంగా పెరిగి తాగునీరు కలుషితం అవుతోంది.

దీంతో నీటి సరఫరా 15- 20శాతం తగ్గిపోయింది. దాదాపు 34 లక్షల మంది ప్రజలు తాగినీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దీన్ని చూపించి ఆప్ సర్కార్ పై అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో లాభ పడాలని బీజేపీ చూస్తోంది. ఇది ఒక వాటర్ టెర్రరిజం"అని దిల్లీ సీఎం ఆతిశీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆతిశీ లేఖలో పేర్కొన్నారు.

ఇక దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార పార్టీ ఆప్.. ఇటీవల ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ప్రజలకోసం 15 గ్యారంటీలను ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+