జమ్మూ కశ్మీర్ లో ఘోరం-నదిలో పడ్డ భద్రతా బలగాల బస్సు-6 గురు మృతి

జమ్మూ కశ్మీర్ లో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పహల్గాంలో 39 మంది ఐటీబీపీ జవాన్లు, పోలీసుల్ని తీసుకెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న జవాన్లు, పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఆరుగురు జవాన్లు చనిపోయినట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోంది.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన ఓ బస్సు నదిలో పడిన ఘటనలో ఇవాళ కనీసం ఆరుగురు జవాన్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులోనే ఉన్న 30 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 39 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 37 మంది ఐటీబీపీ, ఇద్దరు జమ్మూ, కశ్మీర్ పోలీసులు ఉన్నారు. చందన్‌వారి జిగ్ మోర్ ఫ్రిస్లాన్ వద్ద బస్సు అదుపు తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.

atleast 6 jawans killed in bus falls into river accident in pahalgam of Jammu and Kashmir

బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన 30 మందికి పహల్గామ్‌లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వీరిని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి)కి మెరుగైన వైద్యం కోసం పంపారు. స్వల్ప గాయాలతో మరో ముగ్గురు పహల్గామ్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలం కావడం, కొండల మధ్య నుంచి సాగుతున్న ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+