బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏటీఎంకరో.ఇన్: ఏ ఏటీఎం పనిచేస్తుందో చెప్పండి! తెలుసుకోండి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెద్ద నోట్లు రద్దుతో సామాన్యులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే. ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ భారీ లైన్లు, చివరి వారికి నగదు లభించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రయోజక సమాచారం అందజేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా ఓపెన్ ఉన్న ఏటీఎంల వివరాలను పంచుకుంటే ఇతరులకు కూడా ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుంది. ఆదివారం ఏటీఎంలు తెరిచి వున్న విషయాన్ని పలువురు సోషల్ మీడియా ద్వారా ఇతరులకు తెలియజేయడంతో కొంత వరకు సాయపడినట్లయ్యారు.

కాగా, కొంత మంది ఒక గ్రూప్‌‌గా ఏర్పడి ట్విట్టర్ ద్వారా ఏటీఎంలకు సంబంధించిన ఉపయోకరమైన సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. ఏటీఎంకరో.ఇన్ అనే పేరుతో వేదికను ఏర్పాటు చేసి పని చేస్తున్న ఏటీఎంల వివరాలను అందులో పొందుపర్చుతున్నారు. ఏటీఎంకరో.ఇన్‌లో ఏటీఎంలు తెరిచి ఉన్న సమాచారాన్ని ఎవరైనా ఇతరులతో పంచుకోవచ్చు.

ATMkaro.in- A novel way to inform people which ATM is functional

దేశంలోని ఏ సిటీ నుంచైనా ప్రజలు పని చేస్తున్న ఏటీఎంల వివరాలను దీని ద్వారా పంచుకోవచ్చు. గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండ్రోజులపాటు ఏటీఎంలు పని చేయలేదు. ఆ తదుపరి రోజు నుంచి ఏటీఎంలు పనిచేయడం ప్రారంభించాయి.

అయితే, ఎక్కువ సంఖ్యలో ప్రజలు డబ్బులు డ్రా చేస్తుండటంతో తొందరగా డబ్బులు ఏటీఎంలలో అయిపోతున్నాయి. దీంతో ప్రజలు ఏ ఏటీఎం పని చేస్తుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడ, ఏ ఏటీఎంలు పని చేస్తున్నాయో సోషల్ మీడియాలో పంచుకునే సమాచారం ద్వారా పలువురికి ఉపయోగకరంగా ఉంటుంది.

English summary
With several people queueing up outside ATMs to withdraw cash, many on the social media have come up with various ideas to share information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X