Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం నుంచి జనం కోరుకుంటోన్నది ఇదే- కమాండో ఆపరేషన్స్

India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.

అదే సమయంలో భారత్‌లో తిష్టవేసిన ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్‌ను ఏరివేసే పనిని మొదలుపెట్టింది కేంద్రం. అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు, సోదాలు చేపట్టింది. నిద్రాణంగా ఉంటూ వస్తోన్న ఉగ్రవాదులు, వారి సానుభూతిపరుల కోసం జల్లెడ పడుతోంది. పాకిస్తాన్‌తో యుద్ధం అంటూ మొదలైతే- అంతర్గతంగా ఎటువంటి ఉగ్రవాద దాడులూ సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

ATS has arrested a Indian Mujahideen operative Ammar Yashar in Jharkhand

పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగినందుకు నిరసనగా ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా కట్టుదిట్టంగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. మూడో కంటికి తెలియకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ క్రియాశీలక సభ్యుడు అమ్మన్ యాసర్‌ పోలీసుల చేతికి చిక్కాడు. యాంటీ- టెర్రరిజం స్క్వాడ్, పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ సందర్భంగా అతను అరెస్ట్ అయ్యాడు. జార్ఖండ్‌ ఏటీఎస్ టీమ్ అతన్ని అరెస్ట్ చేసింది.

గతంలో దశాబ్ద కాలం పాటు కారాగారంలో గడిపాడు యసర్. బయటికి వచ్చిన తరువాత కూడా ఉగ్రవాద కార్యకలాపాలను మానుకోలేకపోయాడు. ఇండియన్ ముజాహిదీన్‌ అనుబంధ సంస్థ హిజ్బ్ ఉత్-తహ్రీర్‌తో అసోసియేట్ అయ్యాడు. స్లీపర్ సెల్‌గా అతనికి గుర్తింపు ఉంది.

ఈ మాడ్యూల్‌పై దర్యాప్తు సాగిస్తోన్న జార్ఖండ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ చేతికి చిక్కాడు. ధన్‌బాద్‌లోని షంషేర్ నగర్‌లో అమ్మర్ యాసర్‌ను ఏటీఎస్ టీమ్ అరెస్ట్ చేసింది. అతని నుండి మొబైల్ ఫోన్, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 2024లో జైలు నుంచి విడుదలైన యాసర్ తిరిగి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటోన్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఈసారి అతను హిజ్బుత్ తహ్రీర్‌తో అనుబంధం ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పక్కా సమాచారం ఉందని జార్ఖండ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గుప్తా తెలిపారు. యాసర్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌ క్రియాశీలకంగా పనిచేశాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 2014లో జోధ్‌పూర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఈ కేసులో 10 సంవత్సరాలు జైలులో గడిపిన యాసర్ గత ఏడాది మేలో విడుదల అయ్యాడు. ఆ తర్వాత తన సహచరుడు అయాన్ జావేద్‌తో సహా హజ్బ్-ఉత్-తహ్రీర్‌తో అసోసియేట్ అయ్యాడు. అతని సహచరుడు అయాన్ జావేద్‌ను ఇదివరకే అరెస్ట్ అయ్యాడు. అతన్ని విచారించిన సందర్భంగా యాసర్ పేరు తెరమీదికి వచ్చింది.

1953లో జెరూసలేంలో హిజ్బ్ ఉత్-తహ్రీర్‌ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ ఖలీఫాను స్థాపించడం, రాడికలైజేషన్, తీవ్రవాద కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. యూఏపీఏ కింద 2024 అక్టోబర్ 10వ తేదీన ఈ సంస్థపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దీని కార్యకలాపాలను నిషేధించింది.

Take a Poll

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+