ఫ్రాన్స్ దేశస్తుడిని చితకబాదారు: మనీపర్స్, మొబైల్ లాక్కున్నారు

బెంగళూరు: భారత పర్యటన కొసం వచ్చిన విదేశీయుడి మీద దాడి చేసిన కేసులో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కలాసిపాళ్యలో ఒక ప్రయివేటు ట్రావెల్స్ దగ్గర పని చేస్తున్న మహమ్మద్ ఖాన్, కుమార్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని కలాసిపాళ్య పోలీసులు తెలిపారు.

ఫ్రాన్స్ కు చెందిన పినో అనే వ్యక్తి కొంత కాలం క్రితం భారత్ లో పర్యటించడానికి టూరిజం వీసా తీసుకుని వచ్చాడు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంచరించి బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సంచరించాడు. కేరళలోని మున్నార్ వెళ్టడానికి సిద్దం అయ్యాడు.

 Attack on France national in Bengaluru

కలాసిపాళ్యలోని ప్రయివేటు ట్రావెల్స్ లో కేరళలోని మున్నార్ వెళ్లడానికి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో పినో కలాసిపాళ్యలోని ట్రావెల్స్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో బస్సులో లగేజ్ పెట్టే సమయంలో పినోతో మహమ్మద్ ఖాన్, కుమార్ గొడవ పెట్టుకున్నారు.

ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. తరువాత సహనం కొల్పోయిన ఇద్దరు పినోమీద దాడి చేసి చితకబాదారు. అతని దగ్గర ఉన్న విలువైన మొబైల్, మని పర్స్ లాక్కోన్నారు. పినో ఫిర్యాదు చెయ్యడంతో ఇద్దరిని అరెస్టు చేశామని కలాసిపాళ్య పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+