Aunty: మహిళ హత్య కేసులో జైలుకు, నెల ముందు విడుదలై ఆంటీని లేపేశాడు, కాళ్లు, చేతులు కట్టేసి !

ముంబాయి: భార్యతో సక్రమంగా కాపురం చెయ్యకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఇంటికి వెళ్లాడు. భార్య, పిల్లల గురించి అతను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. ఇదే సమయంలో మహిళ హత్య కేసులో అతను జైలుకు వెళ్లాడు. ఐదు సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపిన నిందితుడు నెల రోజుల ముందు బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు జీవితానికి అలువాటుపడిన నిందితుడు బయట ఉండలేకపోయాడో, ఏమో ? మళ్లీ జైలే మేలు అనుకున్నాడు. తాను జైలుకు వెళ్లడానికి కారణం అయిన మహిళ కోసం నెల రోజుల నుంచి గాలించాడు. చివరికి మహిళ ఎక్కడ ఉందో అనే విషయం అతనికి తెలిసిపోయింది. మహిళను పట్టుకుని బెల్ట్ తో ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు. తరువాత మహిళ శరీరం మీద ఉన్న దస్తులు మొత్తం చింపేశాడు. గంట తరువాత మహిళను గొంతు నులిమేశాడు. తరువాత ఆమె తల, ముఖం మీద బండరాయి వేసి పచ్చడి చేసి చంపేశాడు. హత్య కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు మరో ఆంటీని హత్య చేశాడని సీసీటీవీ కెమెరాల్లో గుర్తించి మళ్లీ అతన్ని పట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

జులాయి మొగుడు

జులాయి మొగుడు

ముంబాయిలో సాగర్ యాదవ్ (41) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సాగర్ యాదవ్ కు వివాహం అయ్యింది. సాగర్ యాదవ్ అతని భార్యతో సక్రమంగా కాపురం చెయ్యకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఇంటికి వెళ్లేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం సాగర్ యాదవ్ అతని భార్య, పిల్లల గురించి అతను పూర్తిగా పట్టించుకోవడమే మానేసి జులాయిగా తిరిగేవాడు.

మహిళ హత్య కేసులో అరెస్టు

మహిళ హత్య కేసులో అరెస్టు

2016లో నవీ ముంబాయిలో 32 సంవత్సరాల వయసు ఉన్న మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో సాగర్ యాదవ్ అరెస్టు అయ్యాడు. సాగర్ యాదవ్ ఆమెను హత్య చేశాడని కోర్టులో బలమైన సాక్షాలు వెలుగు చూడటంతో అతను జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి సాగర్ యాదవ్ ముంబాయిలోని తలోజా జైలులో ఉంటున్నాడు.

 నెల ముందు బెయిల్ మీద బయటకు వచ్చాడు

నెల ముందు బెయిల్ మీద బయటకు వచ్చాడు


ఐదు సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపిన నిందితుడు సాగర్ యాదవ్ అక్టోబర్ 7వ తేదీన బెయిల్ మీద ముంబాయి తలోజా జైలు నుంచి విడుదల బయటకు వచ్చాడు. హత్య కేసులో జైలుకు వెళ్లిన సాగర్ యాదవ్ బెయిల్ మీద బయటకు వచ్చి నెల రోజులు కూడా కాకముందే మరో ఆంటీ హత్యకు స్కెచ్ వేశాడు. జైలు జీవితానికి అలువాటుపడిన సాగర్ యాదవ్ బయట ఉండలేకపోయాడో, ఏమో ? మళ్లీ జైలే మేలు అనుకున్నాడు.

మహిళ మీద కసి..... జైలుకు వెళ్లడంతో సాధ్యం కాలేదు

మహిళ మీద కసి..... జైలుకు వెళ్లడంతో సాధ్యం కాలేదు

ముంబాయిలోని ఛాట్ కోపర్ ఏరియాలోని పంత్ నగర్ లో శోభా సోని (52) అనే మహిళ నివాసం ఉంటున్నది. శోభా సోనికి సాగర్ యాదవ్ కు ముందు నుంచి పరిచయం ఉంది జైలుకు వెళ్లకముందు నుంచి సాగర్ యాదవ్ శోభా సోని ఆంటీని హత్య చెయ్యాలని అనుకుంటున్నాడు. అయితే మహిళ హత్య కేసులో జైలుకు వెళ్లిన సాగర్ యాదవ్ కు ఆమెను హత్య చెయ్యడానికి సాధ్యం కాలేదు.

నెల రోజులు గాలించి ఆంటీ ఆచూకి తెలుసుకున్నాడు

నెల రోజులు గాలించి ఆంటీ ఆచూకి తెలుసుకున్నాడు

తాను జైలుకు వెళ్లడానికి కారణం అయిన శోభా సోని కోసం సాగర్ యాదవ్ నెల రోజుల నుంచి గాలించాడు. చివరికి శోభా సోని ఎక్కడ ఉందో అనే విషయం సాగర్ యాదవ్ కు తెలిసిపోయింది. నవంబర్ 2వ తేదీ రాత్రి శోభా సోని ఉన్న చోటకు వెళ్లిన సాగర్ యాదవ్ ఆమెను పట్టుకుని బెల్ట్ తో ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు. తరువాత శోభా సోని శరీరం మీద ఉన్న దస్తులు మొత్తం చింపేశాడు.

 దారుణంగా చంపేశాడు..... సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయాడు

దారుణంగా చంపేశాడు..... సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయాడు


గంట తరువాత సాగర్ యాదవ్ శోభా సోనిని గొంతు నులిమేశాడు. తరువాత శోభా సోని తల, ముఖం మీద బండరాయి వేసి పచ్చడి చేసిన సాగర్ యాదవ్ ఆమెను కసితీరా చంపేశాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. శోభా సోనిని సాగర్ యాదవ్ హత్య చేశాడని పక్కా సమాచారం తెలుసుకుని అతన్ని అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

 భర్తతో విడిపోయిన ఆంటీ

భర్తతో విడిపోయిన ఆంటీ


శోభా సోని భర్త విపరీతంగా మద్యంకు బానిస అయ్యాడని, అందుకే తన సోదరి ఆమె భర్తతో విడిపోయి వేరుగా ఉంటోందని ఆమె సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మహిళ హత్య కేసులో జైలుకు వెళ్లిన సాగర్ యాదవ్ బెయిల్ మీద బయటకు వచ్చి మరో మహిళను హత్య చేసి నెల రోజుల్లోనే అరెస్టు అయ్యాడని పోలీసు అధికారులు అంటున్నారు. జైలు నుంచి బయటకు రావాలని సాగర్ యాదవ్ చాలా కాలం తెలిసిన వాళ్లు కాళ్లు చేతులు పట్టుకుని వేడుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన సాగర్ యాదవ్ కొంతకాలం అయినా బుద్దిగా బయట ఉంటాడని అనుకుంటే నెల రోజుల్లోనే మరో మహళ శోభా సోనిని దారుణంగా చంపేసి మళ్లీ జైలుకే వెళ్లాడని, ఇక అతనికి బెయిల్ ఇచ్చే వాళ్లే కరువు అవుతారని ముబాయి సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+