సిడ్నీలో బెంగళూరు టెక్కీ హత్య.. ఎందుకు?: భారత్‌కు ఆస్ట్రేలియా హామీ
సిడ్నీ: సిడ్నీలో హత్యకు గురైన బెంగళూరు మహిళా ఐటీ కన్సల్టెంట్ కేసులో పూర్తి సహకారం అందిస్తామని భారత్‌కు ఆస్ట్రేలియా హామీ ఇచ్చింది. ప్రభ అరుణ్ కుమార్ (41) హత్య కేసులో న్యాయం చేస్తామని, దర్యాఫ్తును ప్రత్యేకంగా చేపడతామని హామీ ఇచ్చింది.
ఈ హత్యకు సంబంధించి సిడ్నీలోని భారత కౌన్సెల్ జనరల్ సంజయ్ సుధీర్‌తో ఆస్ట్రేలియా అధికారులు మాట్లాడారు. ఈ సంఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
మరోవైపు, తాను ఆస్ట్రేలియాలోని కాన్సులేట్‌తో నిత్యం టచ్‌లో ఉన్నానని, కాన్సులర్ సహకరిస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఈ హత్యలో జాత్యాహంకార కోణం లేదని సిడ్నీ పోలీసులు వెల్లడించారు. తాము అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

భారత కాన్సులేట్ జనరల్ సంజయ్ సుధీర్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి జాత్యాహంకార కోణం లేదని చెప్పారు. ఈ హత్యను చేధించేందుకు ప్రత్యేక డిటెక్టివ్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాబరీని కూడా కొట్టి పారేస్తున్నారు. ఆమె మొబైల్ ఫైన్ ఒక్కటి మాత్రం మిస్ అయింది. ఆమె వద్ద ఉన్న జ్యువెల్లరీ, ఇతర వస్తువులు ఉన్నాయని సంబంధీకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఎందుకు హత్య చేశారనేది తెలియాల్సి ఉంది. జాత్యాహంకార కోణం లేదని, రాబరీ అంశం లేదని చెబుతున్నారు. ఎందుకు హత్య జరిగిందో తెలియాల్సి ఉందని బంధువులు అంటున్నారు.
కాగా, ఆస్ట్రేలియాలో భారత మహిళ ఐటీ కన్సల్టెంట్ ప్రభ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిడ్నీ శివారులోని వెస్ట్ మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిన్నర గంటల ప్రాంతంలో బెంగళూరుకు చెందిన ప్రభాను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందారు. ఆమె తన భర్తతో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. నన్ను ఎవరో కత్తితో పొడిచారు డార్లింగ్ అంటూ ఆమె తన భర్తకు కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications