ప్రియుడిని చంపి ప్రియురాలిపై రేప్, బాధితురాలు ఏం చేసిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రియురాలితో కలిసి లాంగ్‌డ్రైవ్‌కు వెళ్ళిన ప్రియుడిని హత్య చేసి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బాధితురాలు స్థానికుల సహయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

హనీమూన్‌లో నో సెక్స్, పైళ్ళైన 10 రోజులకే విడాకులకెళ్ళిన భర్త

మహరాష్ట్రలో టూ వీలర్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళిన ప్రేమికుల కథ విషాదాంతంగా మారింది. సరదాగా ప్రియురాలితో గడిపేందుకు వెళ్ళిన ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రియురాలు అత్యాచారానికి గురైంది.

యువతిని నిర్భంధించి పది రోజుల పాటు రేప్, డ్యాన్స్ మాస్టర్‌పై కేసు

ఈ ఘటన మహరాష్ట్రలో కలకలం రేపుతోంది. బాధితురాలు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారంగా పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

అక్కా అంటూనే, పెళ్ళి చేసుకోవాలని వేధింపులు, ఎస్ఐ పై దాడికి యత్నం

ప్రియుడిని చంపిన ఆటో డ్రైవర్

ప్రియుడిని చంపిన ఆటో డ్రైవర్

ముంబై నగర శివార్లలోని షాపూర్ కు చెందిన 28 ఏళ్ల యువకుడు చైనీస్ స్టాల్ లో చెఫ్ గా పనిచేసేవాడు. ఏడాది కాలంగా ప్రేమిస్తున్న తన ప్రియురాలితో కలిసి బైక్ పై అంబర్ నాథ్ తీత్వాల రోడ్డుపై లాంగ్ డ్రైవ్ కు వెళ్లాడు. ప్రియురాలితో సరదాగా గడపాలని ప్లాన్ చేశాడు. అయితే రాత్రి పూట ఏకాంత ప్రదేశంలో బైక్ ఆపి కాలకృత్యాలు తీర్చుకొంటుండగా అదే రోడ్డుపై వెళ్తున్న ఆటో డ్రైవర్ నర్వద ప్రియుడిని చంపేశాడు.

ప్రియురాలిపై రేప్

ప్రియురాలిపై రేప్

లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళిన సమయంలో రాత్రి పూట రోడ్డు పక్కనే కాలకృత్యాలను ప్రియుడు తీర్చుకొంటుండగా ప్రియురాలు బైక్ వద్ద నిలబడింది. అయితే అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ నర్వద ప్రియురాలిని ఎత్తుకెళ్ళేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ప్రియుడు అడ్డుపడ్డాడు. ప్రియుడు అంబర్‌నాథ్‌ను నర్వద తుపాకీతో కాల్చి చంపేశాడు. పక్కనే పొదల్లోకి తీసుకెళ్ళి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

డబ్బు, ఆభరణాలతో పారిపోయిన నిందితుడు

డబ్బు, ఆభరణాలతో పారిపోయిన నిందితుడు

అంబర్ నాధ్‌ను చంపి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ నర్వద వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను, డబ్బులతో పాటు బైక్ తీసుకొని పారిపోయాడు. అయితే ఆ రోడ్డుపై వెళ్తున్న వారిని సహయంతో బాధితురాలు స్టేషన్ కు చేరుకొంది.

నిందితుడిని పట్టుకొన్న పోలీసులు

నిందితుడిని పట్టుకొన్న పోలీసులు

తనపై అత్యాచారం చేసి. తన ప్రియుడిని చంపిన నిందితుడి ఆనవాళ్ళను బాధితురాలు పోలీసులకు వివరించింది. ఈ ఆనవాళ్ళ ప్రకారంగా ఆటో డ్రైవర్ నర్వదగా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 30-year-old autorickshaw driver was on Sunday arrested by Thane rural police local crime branch unit for allegedly shooting dead Ganesh Dinkar (26) and raping his girlfriend on the Ambernath-Titwala road on Monday evening. Sanjay Narvade is a resident of Ulhasnagar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి