Available for 24x7: 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయండి: మోడీ

24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ క్షణం కేంద్ర ప్రభుత్వం సాయం కావాలని అనిపించినా తనను సంప్రదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి శనివారం మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, పశ్చిమబెంగాల్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక. ఛత్తీస్ గడ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.

మాస్క్ ధరించి

మాస్క్ ధరించి

వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనగా.. ఈ సారి మాస్క్ ధరించి మోడీ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాగా.. సుదీర్ఘంగా కొనసాగింది. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే తనకు ఫోన్ చేయాలని మోడీ సూచించారు. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. ఆపత్కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కొవచ్చని, మరింత నష్టపోయే అవకాశం ఉండబోదు అని చెప్పారు.

మరో 3 రాష్ట్రాలు

మరో 3 రాష్ట్రాలు

ఇప్పటికే ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించగా.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్ డౌన్ పొడిగించాలని కోరారు. కరోనా వైరస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బెంగాల్ సీఎం దీదీ కోరారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాలను దృష్టిలో ఉంచుకోవాలని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

Recommended Video

    AP Lockdown: Lockdown In AP Will Be Continue In Red Zone Areas Only
    ఇదివరకు కూడా..

    ఇదివరకు కూడా..

    కరోనా వైరస్ పరీక్షించే కిట్లను వీలైనన్ని ఎక్కువగా పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. రైతులకు బోనస్ ప్రకటించాలన్నారు. రహదారులపై ఆంక్షలు విధించి.. రైలు, వాయిు మార్గాలపై ఆంక్షలు సడలించాలని కోరారు. ఏయే రంగాలకు మినహాయింపులు ఇవ్వాలని ముఖ్యమంత్రులను కేంద్ర హోంశాఖ కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడే కాదు ఇదివరకు మార్చి 20వ తేదీన కూడా మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+