"అప్పుడే పైలట్లపై విమర్శలొద్దు"-ఎయిరిండియా ఫ్లైట్ రిపోర్ట్ పై రామ్మోహన్..!
గత నెలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 717 ఐదు నిమిషాల్లోనే కుప్పకూలిన ఘటనపై విచారణ కమిటీ తొలి నివేదిక ఇవాళ బయటికి వచ్చింది. ఇందులో పైలట్లు ఇంజన్ కు ఆయిల్ పంపే స్విచ్ ఆఫ్ అయి ఉండటాన్ని గమనించి తిరిగి దాన్ని ఆన్ చేసే లోపే ప్రమాదం జరిగిపోయినట్లు నివేదిక తేల్చింది. ఈ నేపథ్యంలో పైలట్లపై విమర్శలు వచ్చాయి. వీటిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.
ఇవాళ బయటికి వచ్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద విచారణ నివేదికపై మనం ఎటువంటి నిర్ధారణలకు రాకూడదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మనకు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పైలట్లు, సిబ్బంది ఉన్నారని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. దేశంలోని పైలట్లు, సిబ్బంది చేస్తున్న అన్ని ప్రయత్నాలను తాను అభినందించాలన్నారు. వారు పౌర విమానయానానికి వెన్నెముక అన్నారు. వారు పౌర విమానయానానికి ప్రాథమిక వనరులని తెలిపారు. పైలట్ల సంక్షేమం, శ్రేయస్సుపైనా తాము శ్రద్ధ వహిస్తామన్నారు. కాబట్టి ఈ దశలో మనం ఎటువంటి నిర్ధారణలకు రాకుండా తుది నివేదిక కోసం వేచి చూద్దామని సూచించారు.

దర్యాప్తు నివేదికలో సాంకేతిక అంశాలు ఉన్నాయని, కాబట్టి ఈ నివేదికపై వ్యాఖ్యానించడం అసందర్భమవుతుందన్నారు. ప్రాథమిక నివేదిక వచ్చింది కానీ కచ్చితంగా ఏదైనా తేలే వరకూ వేచి ఉండాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం 171 రెండు ఇంజిన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే రెండు స్విచ్‌లు ఆపేసి ఉన్నాయని, ఆ తర్వాత పైలట్ గందరగోళానికి గురయ్యారని, జూన్ 12న విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత కూలిపోయిందని ఇవాళ వెలువడిన నివేదిక తెలిపింది. ఒక పైలట్ ఇంధనాన్ని ఎందుకు ఆపివేసారని అడిగితే, మరొకరు తాను అలా చేయలేదని సమాధానం ఇచ్చారని పేర్కొంది. దీంతో పైలట్లపై విమర్శలు వస్తున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications